Movies

అజిత్ కి ప్రమాదం – ఎంతమంది అభిమానులు స్పందించారో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

ప్రముఖ నటుడు అజిత్‌కు బుధవారం నాడు షూటింగ్‌లో ప్రమాదం జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రమాదంలో గాయపడ్డ అజిత్ కి దాదాపుగా వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అయితే తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని అజిత్ అభిమానులందరూ కూడా ట్విట్టర్ వేదికగా ఇప్పటికే కొన్ని వేల పోస్టులు పెట్టారు. కాగా అజిత్‌ తాజాగా మంచి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వాలిమై’. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బోనీకపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా కొన్ని బైక్‌ రైడ్‌ సీక్వెన్స్‌ ను తెరకెక్కించే సమయంలో ప్రమాదవశాత్తూ అజిత్‌ ఒక్కసారిగా బైక్‌ నుంచి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో అజిత్ కి స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే కాసేపు విరామం తీసుకొని మళ్ళీ అజిత్ షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే అజిత్ ప్రమాదానికి గురయ్యారనే విషయం తెలుసుకున్న అభిమానులు ట్విట్టర్ వేదిక ద్వారా అజిత్‌ గురించి పోస్టులు పెడుతున్నారు. తమ అభిమాన నటుడు అజిత్‌ వెంటనే కోలుకోవాలంటూ #GetWellSoonTHALA అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఇప్పటికే దాదాపు 83 వేల ట్వీట్లు చేశారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."