Movies

రాశి ఖన్నా పేరెంట్స్ తో గొడవపడి వచ్చేసిందా? కారణం అదేనా… ?

అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా నాగశౌర్య సరసన ఊహలు గుసగుసలాడే చిత్రంతో కథానాయికగా ఆరంగేట్రం చేసింది. అయితే తొలుత బాలీవుడ్ లో ఓ సినిమాలో నటించింది. అటుపై టాలీవుడ్ లో పెద్ద స్టార్ అయ్యింది. వెంకీమామ- ప్రతిరోజూ పండగే చిత్రాలతో హిట్లు కొట్టింది. రాశీ ప్రస్తుతం తదుపరి కెరీర్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించిందట. చాలామంది సినిమాల్లో యాక్ట్ చేయాలని ఉవ్విళ్లూరతారు. ఎందుకంటే రంగుల ప్రపంచం కదా. అక్కడ కలల్ని నిజం చేసుకునేందుకు మగాళ్లే కాదు, ఎందరో భామలు ఇంట్లోవాళ్లతో ఘర్షణ పడాల్సిన పరిస్థితి ఉంటుంది.

అలాంటి ఘర్షణలో తమ డ్రీమ్ ని నెరవేర్చుకునేందుకు తల్లిదండ్రులను వ్యతిరేకించి దూరంగా వచ్చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా ఎందరో భామలు రంగుల పరిశ్రమలో తమ కలల్ని నెరవేర్చుకునేందుకు నగరాలకు షిఫ్ట్ అవుతారు. ఇక తానుకూడా ఏమీ తినలేదన్నట్లు అందరిలానే రాశీ ఖన్నా కూడా తల్లిదండ్రుల తో గొడవపడాల్సి వచ్చిందట. ఆసమయంలో అమ్మా నాన్నలపై మమకారంతో వారిని విడిచి రావాల్సిన పరిస్థితిలో ఎంతో హృదయవేదనకు రాశీఖన్నా గురైందట. ఎంతో బాధతో ఏడ్చేసిందట. డిప్రెషన్ కి గురయ్యానని కూడా ఈ అమ్మడు అంటోంది. కానీ లైఫ్ లో ఇలాంటివన్నీ చాలా కామన్ అని కూడా లైట్ తీసుకుంటోంది.

ఇక తన జీవిత గమ్యం గురించి తెలుసుకున్న తర్వాత తల్లిదండ్రులు కూడా సెట్ రైట్ అయ్యారని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఒక్కటి మాత్రం నిజం ఆరోజు అలాంటి డేరింగ్ స్టెప్ తీసుకోకపోయి ఉంటే ఇప్పుడు హీరోయిన్ అయి ఉండేదా అనే క్వశ్చన్ వస్తోంది. ఇక్కడ ఇంత పెద్ద స్టార్ డమ్ ని ఆస్వాధించే అవకాశం దక్కి ఉండేదా? అంటే చెప్పలేం. లైఫ్ అంటేనే ఇలాంటి ఎన్నో సర్ ప్రైజ్ లు ఉంటాయి. అన్నిటినీ ఎదుర్కొని ఎదగాల్సి ఉంటుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."