Movies

ఎందుకో ప్లాన్ మార్చేసిన “అల వైకుంఠపురములో” టీం.!

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ “అల వైకుంఠపురములో” థియేటర్స్ లో ఇంకా సందడి కొనసాగిస్తోంది.అయితే ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే పక్కా ప్రణాళిక ప్రకారం ప్రతీ అంశాన్ని అభిమానులతో చిత్ర యూనిట్ పంచుకునే వారు అలాగే ఏ ముఖ్యమైన అప్డేట్ అయినా సరే తప్పకుండా చెప్పేవారు.అలాగే ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక అప్డేట్ ను కూడా అలాగే ఇచ్చారు.ఈ చిత్రాన్ని అంత త్వరగా అయితే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి విడుదల చెయ్యబోమని ముందే డిజిటల్ స్ట్రీమింగ్ వీక్షకులకు షాకిచ్చారు.

దీనితో ఇక ప్రతీ ఒక్కరూ థియేటర్స్ వరకు వచ్చి తీరారు.అంతే కాకుండా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ లలో చూసే అవకాశం కూడా లేదని ఈ సినిమా డిజిటల్ హక్కులు సన్ నెక్స్ట్ వారు సొంతం చేసుకున్నారని కూడా తెలిపారు.దీనితో అంతా ఈ చిత్రం డిజిటల్ గా ఎలాగో లేట్ గానే వస్తుంది కదా అనుకుంటే “అల వైకుంఠపురములో” టీం ప్లాన్ మార్చేసి షాక్ ఇచ్చారు.జనవరిలో థియేటర్స్ లోకి ఈ చిత్రం వస్తే ఇప్పుడు ఫిబ్రవరి 26 నుంచి సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ కాబోతుంది అని అధికారికంగా వెల్లడి చేసారు.ముందు లేట్ గా విడుదల చేస్తాం అని చెప్పి ఇప్పుడు అన్నిటికన్నా ముందే పెట్టేస్తున్నారు. మరి దీని వెనుకున్న ఆంతర్యం ఏమిటీ అన్నది తెలియాల్సి ఉంది.