Politics

అమరావతి రైతుల కీలక నిర్ణయం – ఏంటో తెలుసా…?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా రాష్ట్ర రాజధాని విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రజలందరికి మధ్యన ఒకరకమైన పోరాటం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన ఆందోళనలు చేస్తూ, నిరసనలు తెలుపుతున్నారు. ఇకపోతే రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు తమ భూములను ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ మూడు రాజధానుల నిర్మాణానికి అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు తాజాగా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా రేపు రాజధాని అమరావతి బంద్ కి రైతులు పిలుపునిచ్చారు.

కాగా అమరావతి లోని 29 గ్రామాల పరిధిలో బంద్ పాటించాలని స్థానిక రైతులు నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా విద్య, వ్యాపార సంస్థలు బంద్ పాటించాలని జేఏసీ కోరారు. కాగా రాజధానిని అమరావతిలోని కొనసాగించాలని రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. గత కొద్దీ రోజులుగా మూడు రాజధానుల నిర్మాణానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే పోలీసులు తమపై అక్రమంగా దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు బంద్ కి పిలుపునిచ్చారని తెలుస్తుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."