Movies

వరల్డ్ ఫేమస్ లవర్ అంత ముంచిందా…బయ్యర్ల పరిస్థితి ఏమిటో…?

టాలీవుడ్ రౌడీ స్టార్ నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజ్ అయ్యింది.ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.కాగా ఈ సినిమా రిలీజ్ రోజున మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం పడింది.ఇక సినిమా కంటెంట్ కూడా యూత్‌ను టార్గెట్ చేసి ఉండటంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు దూరంగా ఉన్నారు.

దీంతో ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా వచ్చాయి.మొదటి వారం ముగిసే సరికి ఈ సినిమాకు రూ.8 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు వచ్చాయి.దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు అంత తక్కువ కలెక్షన్లు రావడంతో ఈ సినిమా నష్టాల బాట పట్టడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అన్నారు.ఇక ఈవారం భీష్మ సినిమా రిలీజ్ కావడం, దానికి పాజిటివ్ టాక్ రావడంతో వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం మరింత ఎక్కువ నష్టాలను మిగిల్చడం ఖాయమని అంటున్నారు.

ఈ సినిమా టోటల్ రన్‌లో బయ్యర్లకు ఏకంగా 50 శాతంకు పైగా నష్టాలను మిగిల్చనుంది.రూ.30 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ జరిపిన ఈ సినిమా ఇంత భారీ నష్టాలను మిగిలిస్తుండటంతో విజయ్ దేవరకొండ సినిమాలను కొనేందుకు బయ్యర్లు భయపడుతున్నారు.మరి వరల్డ్ పేమస్ లవర్ టోటల్ రన్‌లో ఎంత నష్టాలను మిగిలుస్తుందో చూడాలి అని వారు లెక్కలేస్తున్నారు.