Movies

బొద్దుగా ఉండే మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా?

అమ్మాయి బాగుంది మూవీతో టాలీవుడ్ కి నేరుగా పరిచయమైన హీరోయిన్ మీరా జాస్మిన్ ఆ మూవీలో రెండు పాత్రల్లో మురిపించింది. అందం ,అభినయంతో కలబోతగా సౌత్ ఇండియా ఆడియన్స్ కి దగ్గరైన ఈమె సూత్రధారం అనే మలయాళీ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కేరళలో కుట్టపజా గ్రామానికి చెందిన జోసఫ్ ,అలియెమ్మ దంపతులకు1982ఫిబ్రవరి 15న జన్మించిన ఈమె కు ఇద్దరు సోదరులు. వాళ్ళు కూడా నటులే. సోదరులు ఇద్దరిలో ఒకరు ఛాయాగ్రాహకునిగా వ్యవహరిస్తున్నాడు. డిగ్రీ చదువుతుండగా దర్శకుడు బ్లేస్సి దృష్టిలో పడడంతో సూత్రధారంలో నటించే ఛాన్స్ కొట్టేసింది.

సినిమాల్లో చేస్తానని,డాన్స్ లు వేస్తానని ఎప్పుడూ అనుకోలేదని మీరా చెబుతుంది. మాండలిన్ రాజేష్ తో ప్రేమలో పడిందన్న రూమర్స్ వచ్చినా,,2014లో దుబాయ్ కి చెందిన ఇంజనీర్ టైటస్ ని పెళ్లాడింది. ప్రస్తుతం భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. నిజానికి ఈమె రన్ మూవీతో తెలుగు,తమిళ ఆడియన్స్ కి ఒకేసారి పరిచయం అయింది. అమ్మాయి బాగుంది మూవీ లో ఆమె నటన బాగుండడంతో పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్,రవితేజాతో భద్ర ,గోపీచంద్ తో రారాజు,బాలకృష్ణతో మహారథి వంటి చిత్రాల్లో తన నటనతో అలరించింది.

యమగోల మళ్ళీ మొదలైంది,మా ఆయన చంటిపిల్లాడు, గోరింటాకు,బంగారు బాబు మూవీస్ తో మీరా జాస్మిన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. విశాల్ తో నటించిన పందెంకోడి మూవీ కూడా అలరించింది. పందెం కోడి 2లో చిన్నపాత్రలో వేసిన ఈమె తెలుగులో మోక్ష చివరి మూవీ. దక్షిణాది నాలుగు భాషల్లో తక్కువ సినిమాలే చేసినా స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. మలయాళంలో జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. భర్తతో అనుకోని కారణాల వలన విడిపోయిన ఈమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే బాగా లావెక్కడంతో ఛాన్స్ లు రాలేదు. దాంతో ఫిట్ నెస్ పై దృష్టి పెట్టింది. దాంతో చాలా నాజూగ్గా తయారైంది. మరి ఇప్పుడైనా సినిమాల్లో వరుస ఛాన్స్ లొస్తాయేమో చూడాలి.