ఆమ్మో మహేష్ కూతురు మాములు ఖతర్నాక్ కాదు..ఎంత టాలెంట్ ఉందో తెలుసా?
స్టార్స్ పిల్లలు అయినంత మాత్రాన సరిపోదు,వాళ్ళకంటూ టాలెంట్ ఉండాలి. అప్పుడే వాళ్ళ సత్తా తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార టాలెంట్ ఏమిటో ఇప్పటికే సోషల్ మీడియాలో చూపిస్తోంది. నాలుగేళ్ల వయస్సులోనే గూగుల్ లో ఓ పేజ్ క్రియేట్ చేసుకుంది. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని పాకెట్ మనీగా సరిపడా సంపాదిస్తోంది. మూడేళ్ళ వయస్సులోనే డాన్స్ చేయడంలో దిట్టగా మారింది. 2015లోనే మాటివి అవార్డ్స్ లో స్టేజ్ మీదికి మహేష్ తో పాటు వెళ్లిన సితార మ్యూజిక్ వినగానే డాన్స్ చేయడం మొదలుపెట్టింది.
ఇక ఆగడు సినిమా షూటింగ్ కి మహేష్ ఫ్యామిలీ వెళ్ళినపుడు అక్కడ సాంగ్ షూటింగ్ చేస్తున్నారు. సాంగ్ ప్లే చేయగానే మహేష్ కంటే ముందే సితార డాన్స్ చేస్తూ ఫుల్ జోష్ నింపేసింది. ఇక ఈమధ్య స్కూల్ వార్షికోత్సవంలో డాన్స్ తో అదరగొట్టింది. శ్రీమంతుడు సినిమాలో రామ రామ సాంగ్ కి డాన్స్ చేసి అందరినీ అలరించింది. ఇక తాజాగా రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు మూవీలో తమన్నా డాంగ్ డాంగ్ అంటూ చేసిన సాంగ్ కి సితార డాన్స్ చేసి,అదరగొట్టింది.
చదువులో కూడా సితార దిట్ట. మంచి మార్కులు తెచ్చుకుంటోంది. కూచిపూడి డాన్స్ కూడా నేర్చుకుంటోంది. ప్లే స్కూల్ లో చేరినపుడు ఆటల్లో మంచిపేరు తెచ్చుకుంది. ఇక షెఫ్ అవతారం ఎత్తి ఫ్యామిలీ చాకోలెట్ కూడా తయారుచేస్తుంది. మహేష్ ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాడు. అయితే కూతురు సితార మాత్రం ఇప్పటినుంచే ఫ్రెండ్స్ గ్యాంగ్ ని మెయింటేన్ చేస్తోంది. నూడిల్స్ కూడా తయారుచేస్తుంది. పుట్టినరోజు ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చింది. గౌతమ్ కామ్ గా ఉంటె అతడి అల్లరికూడా సితార చేసేస్తోంది. అయితే ఆమె అల్లరిని నమ్రత కంట్రోల్ చేస్తున్నందున నాన్న కూచిగా మారిందట.