Movies

గుర్తుపట్టకుండా మారిపోయిన ఈ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా??ఇతని తండ్రి కూడా ఒకప్పటి ప్రముఖ టాలీవుడ్ హీరో

సినీ ఇండస్ట్రీలో కొందరు వారసత్వంతో వస్తుంటే ,కొందరు స్వతహాగా వస్తున్నారు. అయితే ఒకటి రెండు సినిమాల తర్వాత ఛాన్స్ లు రాకపోవడం వలన వెనక్కి వెళ్లలేక ,ఉండలేక సతమతమయ్యేవారు కొందరైతే,క్యారెక్టర్ రోల్స్ కి పరిమితమయ్యేవారు మరికొందరు ఉన్నారు. ఇక కొందరు ఇండస్ట్రీని వదిలేసేవాళ్ళు ఉన్నారు. కొందరికి వారసత్వం కూడా అచ్చిరావడంలేదని టాక్ కూడా ఉంది. ఇక నటి , దర్శకురాలు విజయనిర్మల జయంతి సందర్బంగా సూపర్ స్టార్ కృష్ణ ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు,సూపర్ స్టార్ ఫ్యామిలీ హాజరయ్యారు.

అయితే వీళ్ళతో పాటు వచ్చిన ఓ యంగ్ హీరో ని చూసి అక్కడివాళ్లంతా అవాక్కయ్యారట. ఏంటి యితడు ఇలా తయారయ్యాడు అని గుసగుసలాడుకున్నారట. ఇతడి తండ్రి నయం సినిమాల్లో నటిస్తూ,బాగానే రాణిస్తున్నాడు అని అనుకున్నారట. అతడు ఎవరో కాదు నరేష్ కొడుకు నవీన్ విజయ కృష్ణ. నందినీ నర్సింగ్ హోమ్,ఊరంతా అనుకుంటున్నారు,అయినా నువ్వు ఇష్టం వంటి సినిమాల్లో హీరోగా చేసాడు. బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినా సినిమాలు ఆడకపోవడంతో కనుమరుగయ్యాడు.

నాయనమ్మ విగ్రహావిష్కరణకు వచ్చిన అతడిని పరికించి చూస్తే తప్ప అతడెవరో ఎవరూ గుర్తుపట్టలేదట. ఈ ఫొటోలే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సెలబ్రిటీలు అంటే చూడ్డానికి ఏమీ లేకున్నా హడావిడిగా ఉండాలి. లేకపోతె అతడి పరిస్థితి ఏమీ బాగోలేదని జమకట్టేస్తారు. అందుకే నవీన్ విజయ్ కృష్ణను సినిమాలు లేనందునే ఇలా అయ్యాడేమో అని అందరూ అంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."