Movies

విడాకులు తీసుకున్న హీరోయిన్స్ తో షూటింగ్ లొకేషన్ లో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న హీరోస్ వీళ్ళే

ఎవరు ఎప్పుడు ప్రేమలో పడతారో ఎవరికీ తెలియదు. అలాగే ఎప్పుడు విడిపోతారో కూడా తెలియదు. ప్రేమించడానికి పట్టిన సమయం విడిపోడానికి పట్టడంలేదు. మామూలు జనాల నుంచి సెలబ్రిటీల వరకూ ఇదే ఒకే రకంగా ఉంది. ఇంకా వింత ఏమిటంటే, ప్రేమలో,పెళ్ళిలో ఒకసారి ఫెయిలయితే పెద్దగా కంగారు పడిపోవడంలేదు. ఎందుకంటే మళ్ళీ ప్రేమలో పడి పెళ్ళికి రెడీ అవుతున్నారు. పెళ్లయి,విడాకులు తీసుకున్న వాళ్ళతో సెట్ లో నటించేటప్పుడు ప్రేమలో పడిన దాఖలాలు చాలానే ఉన్నాయి. మూడు పెళ్లిళ్లు చేసుకున్న రాధిక విషయాన్నీ తీసుకుంటే,ప్రతాప్ పోతన్, ఆతర్వాత ఆస్ట్రేలియా వ్యక్తితో ప్రేమ పెళ్లి విషయంలో దెబ్బతిని కూడా మూడోసారి పెళ్లాడింది. అప్పటీకే పెళ్లయి ఒంటరిగా ఉన్న శరత్ కుమార్ ఓ షూటింగ్ లో ఈమెను ప్రేమించి, ఆతర్వాత పెళ్లిచేసుకున్నాడు.

నటుడు కమల్ హాసన్ నటి వాణి తో పెళ్లియి విడిపోయాక సారిక ను ప్రేమించి పెళ్లాడాడు. తర్వాత ఆమెతో విడిపోయాక, సెట్ లో గౌతమిని చూసి మనసు పారేసుకున్నాడు. అప్పటికే పెళ్లయి,ఒక కూతురితో విడిగా ఉంటున్న గౌతమితో సహజీవనం చేసాడు. పదేళ్ల తర్వాత విడిపోయింది. సీనియర్ నటి సీత మొదట్లో పార్తీబన్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఇద్దరు కూతుళ్లు పుట్టాక మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అయితే కుంగిపోకుండా సీరియల్స్ నటించడం స్టార్ట్ చేసిన ఆమెను చూసి బుల్లితెర నటుడు ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పెళ్ళిచేసుకుని కొన్నాళ్ళు బానే ఉన్నారు. అయితే తర్వాత విడిపోవడంతో ఆమె ఒంటరిగానే ఉంటోంది.

వినయ విధేయ రామ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రశాంత్ నిజ జీవితంలో దారుణంగా మోసపోయాడు. పెద్దలు కుదిర్చిన గృహలక్ష్మి అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. అయితే అప్పటికే పెళ్లయి పిల్లలున్న గృహలక్ష్మి గురించి ఈ రహస్యం దాచేసి మరీ పెళ్ళిచేయడంతో తనను మోసం చేశారని కోర్టుకి వెళ్ళాడు. కావ్య మాధవన్,దిలీప్ ల ప్రేమ కథ చూస్తే,వీళ్లిద్దరి కాంబోలో 20కి పైనే సినిమాలు వచ్చాయి. అయితే అంతకుముందే దిలీప్ కి ఓ హీరోయిన్ తో పెళ్లయి ఒక కూతురు కూడా ఉంది. అయితే సెట్ లో ప్రేమించిన కావ్యను ప్రేమించడంతో మాధవన్ తో పెళ్ళిచేసారు. అయితే మూడు నెలలు తిరక్కుండానే కావ్య అతడిని కోర్టుకి లాగి,నానా రభస చేసి మరీ డైవర్స్ తీసేసుకుంది. ఇక నటి భావనతో దిలీప్ సన్నిహితంగా ఉంటున్నాడని ఆమెను కావ్య మాధవన్ కిడ్నాప్ చేయించిన కేసు ఇంకా నడుస్తోంది. ఈ కేసులో ఏడాదికి పైగా బెయిల్ లేకుండా జైలులోనే దిలీప్ మగ్గాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."