హైపర్ ఆది నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తాడో తెలుసా?
జబర్దస్త్ షోలో ఎందరో కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ అందులో హైపర్ ఆది రూటే వేరు. తెలుగు రాష్ట్రాల్లో ఇతడి పేరు మారుమోగుతోంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన హైపర్ ఆది, ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ కి వచ్చాడు. జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఫన్నీ వీడియోస్ చేసి,సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు.
ఆ వీడియోలు వైరల్ కావడంతో జబర్దస్త్ లో కమెడియన్ గా ఛాన్స్ వచ్చింది. దాంతో తన సత్తా చాటుతూ టీమ్ లీడర్ కూడా అయ్యాడు. తన స్కిట్స్ తో అశేష జనాన్ని అలరించే ఆది ఫేమస్ గా నిలిచాడు. జబర్దస్త్ లో ఇతడి స్కిట్స్ ఎంతోపేరు తెచ్చుకున్నాయి.తను వేసే పంచ్ డైలాగులకు జనానికి నవ్వులే నవ్వులు అని చెప్పాలి. తనకు వచ్చే డబ్బుల్లో అనాధ ఆశ్రమాలకు,పేదపిల్లలకు సాయంగా అందిస్తాడు.
ఎంతో పాపులార్టీ గల హైపర్ ఆది నెలకు ఎంత సంపాదిస్తాడు, షోస్ కి ఎంత, సినిమాలకు ఎంత, ఏడాది ఆదాయం ఎంత,నెట్ వర్త్ ఎంత వంటి విషయాల్లోకి వెళ్తే, జబర్దస్త్ లో 35లక్షలు సంపాదిస్తాడు. ఈ షోలో ఇతడి పాపులారిటీ చూసి సినిమాల్లో ఛాన్స్ లు రావడంతో నటించాడు. దీంతో ఏడాదికి నెట్ వర్త్ 65లక్షలుగా ఉంది. సొంత ఊరిలో ఒక ఇల్లు,హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఒక ఇల్లు కొన్నాడు.
