మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ చేసిన హీరో ఎవరో చూడండి
ఈమధ్య పాన్ ఇండియా మూవీస్ ఎక్కువే వస్తున్నాయి. అందుకే బడ్జెట్ పెరిగిపోతోంది. దేశమంతా అన్ని రాష్ట్రాల్లో తన పేరు మీద మార్కెట్ అయ్యే ఇమేజ్ రావడమే పాన్ ఇండియా మూవీ ఉద్దేశ్యం. బాహుబలితో ప్రభాస్,కన్నడలో కెజిఎఫ్ హీరో యష్ పాన్ ఇండియా స్టార్స్ గా చెప్పగలం. అయితే అప్పట్లో అమితాబ్ కి దేశమంతా క్రేజ్ ఉండేది. ఇక రజనీకాంత్,కమల్ హాసన్ లు కూడా కొంతవరకూ దేశంలో తమ పేరు వినిపించేలా చేసుకున్నారు.
అయితే మొట్టమొదటి సారిగా పాన్ ఇండియా స్టార్ స్టేటస్ చూసిన హీరో అనగానే కింగ్ నాగార్జున గురించే చెప్పితీరాలి. ఆతర్వాత రజనీకాంత్,ప్రభాస్,తదితరులు ఇలాంటి స్టేటస్ తెచ్చుకున్నారు. గీతాంజలి సినిమా తర్వాత యూత్ లో నాగార్జునకు క్రేజ్ పెరగడంతో తమిళంలో కూడా డబ్ కావడంతో నాగ్ కి అక్కడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్,అక్కినేని,శ్రీదేవి,ఇలా కొద్దిమందికి మాత్రమే తమిళనాట ఫాన్స్ ఉండేవారు. కానీ ఆతర్వాత తరంలో తొలిసారి ఇలాంటి పేరు తెచ్చుకున్న హీరో నాగ్. ఇక శివ సినిమా అయితే తమిళంలో రజనీకాంత్ రికార్డ్స్ ని సైతం బద్దలు కొట్టింది.
కన్నడం,మలయాళంలో కూడా హిట్ గా నిల్చిన ఈ మూవీ హిందీలో కూడా రీమేక్ అవ్వడంతో అక్కడా సంచలన విజయం సాధించింది . యుపి,బీహార్ లలో సైతం నాగ్ కి ఫాన్స్ ఏర్పడ్డారు. దీంతో ఇండియా వైడ్ నాగ్ పేరు మారుమోగింది. 1990తర్వాత ఆలిండియా సూపర్ స్టార్ గా నాగ్ ని పత్రికలు కీర్తించాయి. నేటి సిద్ధార్ధ సినిమాకు ముంబయిలో ఫాన్స్ చేసిన హడావుడి అమితాబ్ సినిమాలతో సమానంగా నిల్చిందట. ఇక ఆతర్వాత చైతన్య,జైత్రయాత్ర, కిల్లర్,అంతం ఇలా అన్ని సినిమాలు ఇండియా వైడ్ విడుదలయ్యాయి. ఇక ఇండియా లో 50లక్షలు కూడా ఎవరికీ రెమ్యునరేషన్ లేదు. అయితే శాంతి క్రాంతి మూవీకి 75లక్షలు నాగ్ తీసుకోవడం గ్రేట్.

