ఇప్పటికీ ఆ బజారంటే మెగాస్టర్ కి భయం అంట…ఆ కథ ఏమిటో చూద్దాం
టాలీవుడ్ లో స్వయంకృషితో పైకి వచ్చిన వాళ్లలో చిరంజీవి ఒకరు. చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ మెగాస్టార్ అయ్యాడు. పట్టుదల, క్రమశిక్షణతో ఒక్కో మెట్టు ఎక్కి మెగాస్టార్‌గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఓ సందర్భంలో ఓ కప్పల కథను చెప్పుకొచ్చాడు. ‘ఓ కప్ప పైకి ఎక్కుతుంటే మిగతా కప్పలు వాటినీ నిరుత్సాపరుస్తుంటాయి. కానీ ఓ కప్ప మాత్రం ఎలాగో అలాగో పైకి ఎక్కేస్తుంది. ఆ కప్ప చెవిటిది కాబట్టి ఎవరి మాట పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పైకెక్కేసింది. ఇండస్ట్రీలో కూడా మనం అలాగే ఉండాలి’అని చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో ఉన్నపుడు కూడా నెగిటివ్ మాటలు మాట్లాడే వాళ్లు ముందు మనం చెవిటి వాళ్లం అయిపోవాలి’అని చెప్పాడు.
జీవితంలో మనం ఎపుడు నెగిటివ్‌గా ఆలోచించవద్దు. ఏ పనినైనా శ్రద్ధగా చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం అని ఈ చిరంజీవి ఆనాటి రోజులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక చిరంజీవికి చెన్నైలోని ఒక పాండీ బజార్ అంటే చాలా భయమట.అందుకే ఇప్పటికే ఆ ప్రాంతానికి వెళ్లనని స్వయంగా చిరంజీవి స్పష్టంచేశారు. ‘నేను ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చదువుతున్నపుడు కెరీర్ ప్రారంభంలో పాండీ బజార్ వైపు అసలు వెళ్లే వాడిని కాదు. అక్కడా అంతా అవకాశాలు సరిగా వినియోగించుకోని వారు. అవకాశాలు రాని వాళ్లు ఫస్ట్రేషన్ కలిగిన వాళ్లు నిండుగా ఉండేవారు. అక్కడి నేను వెళితే, నాపై నాకు నమ్మకం పోతుందనే ఉద్దేశ్యంతో అక్కడికీ వెళ్లేవాడిని కాదు’అని చిరంజీవి చెప్పుకొచ్చాడు.
ఇక పాండీ బజార్ లో ఓ సారి నాకో వింత అనుభవం ఎదురైంది. ‘అక్కడ కొంత మంది నన్ను చూసి నువ్వు యాక్టర్ అవుతావా ? ఫేస్ ఎపుడైనా చూసుకున్నాావా అని అనరాని మాటలు అన్నారు. ఆ మాటలతో నా మనసు చివుక్కుమంది. ఓ సారి నా పై నాకే నమ్మకం పోయింది. ఆ తర్వాత ఎవరో అన్న మాటలను అంతగా పట్టించుకోవాల్సిన పనిలేదని మనసుకు సర్థిచెప్పుకున్నా. ఆ తర్వాత పాండీ బజార్‌లో ఉన్న వాళ్ల మాటలు వినకూడని డిసైడ్ అయ్యా.ఒక వేళ వెళ్లినా, పని చూసుకుని వెంటనే వచ్చేసేవాడిని’అని చిరంజీవి చెప్పుకొచ్చాడు.
