Movies

అప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు బాధపడుతున్న అర్చన…రాజమౌళి సినిమా మరి …!

అందం.. అభినయంతో పాటు కాస్త తెలివి కూడా ఉంటేనే సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా రాణించ గలరని అంటూంటారు. ముఖ్యంగా వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను ఒప్పుకోకుండా ఆచితూచి అడుగులు వేయాలి. అదే సమయంలో మంచి ఆఫర్ వచ్చిన సమయంలో వేరే చిన్న ఆఫర్లను చూసుకుని వదిలేసుకుంటే చాలా పెద్ద తప్పు చేసినట్టే. అందుకే సినిమాల ఎంపిక విషయంలో తెలివి కావాలి కనుక హీరోయిన్ గా స్టార్ డం పొందేందుకు కూడా తెలివి అవసరం. అలా తెలివిగా అడుగులు వేయక పోవడంతో తన కెరీర్ ఇలా అయ్యిందని అర్చన తెగ బాధపడుతోంది.

తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించడంతో పాటు.. తెలుగు బిగ్ బాస్ తో ప్రేక్షకులకు మరింత దగ్గర అయిన ముద్దుగుమ్మ అర్చన ఇటీవలే వివాహం చేసుకుంది. కెరీర్ లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఆమె చివరకు పెళ్లితో ఇండస్ట్రీకి బైబై చెప్పింది. ఇంకా వెయిట్ చేస్తే ఆఫర్లు రాకపోవచ్చు అనుకుని పెళ్లి చేసుకుందంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అర్చన తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో తనకు ‘మగధీర’ చిత్రంలో సలోని పోషించిన పాత్రలో నటించే అవకాశం వచ్చింద ని చెప్పింది.

‘అయితే ఆ సమయంలో తాను హీరోయిన్ గా చేయాలనే ఉద్దేశ్యంతో ఆ ఆఫర్ వదిలేశా. మగధీర వంటి సినిమాను వదిలేయడం అనేది నా జీవితంలో చేసిన పెద్ద తప్పు. ఆ తప్పు కారణంగా నా కెరీర్ లో చాలా మార్పు మిస్ అయ్యా. అది కాకుండా ఇంకో పెద్ద సినిమాలో కూడా ఛాన్స్ వదిలేశా’అని అప్పటి తప్పుకు ఇప్పుడు తెగ బాధపడిపోయింది. అయినా ఎప్పుడో జరిగి పోయిన తప్పుకు ఇప్పుడు బాధపడి మాత్రం ఏం లాభం, నీ కెరీర్ ఎంత వరకు సాగిందో అదే బెటర్ అనుకుని హాయిగా ఫ్యామిలీ జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చుగా అంటూ నెటిజన్స్ అర్చనకు సలహా ఇస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."