Movies

టాలీవుడ్ యంగ్ హీరోల కార్లు .. వాటి రేట్లు తెలుసా?

గతంలో సినీ హీరోలు అవసరానికి కార్లను వాడేవారు. కానీ యువ హీరోలు కార్లను లగ్జరీ గా భావిస్తున్నారు. రెండు మూడు హిట్స్ కొడితే చాలు ఖరీదైన కారు కోనేయ్యల్సిందే అన్నట్టుగా ఉంటోంది. అందుకే ఒక్కొక్కరికి రెండు,మూడు ,నాలుగు కార్ల వరకూ ఉంటున్నాయి. నాగచైతన్యకు కార్లు,బైక్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇతడికి 7కార్లు ఉన్నాయి. ఫెరారీ 488జీటీబీ కారు ధర 4కోట్ల40లక్షలు. మెర్సిడెస్ జిఏజి జి 63కారు 2కోట్ల18లక్షలు. ఇక మూడో కారు రేంజ్ రోవర్. దీని ధర 80లక్షలు. ఇక నిస్సాన్ జిటిఆర్ కారు ధర 2కోట్ల12లక్షలు. కాగా 5వ కారు ఫెరారీ 430ధర 2కోట్లు. బిఎం డబ్ల్యు ఎఫ్ 5మోడల్ ధర కోటి 55లక్షలు. ఇక ఆఖరుగా 7వ కారు డేన్జ్ జిల్ ఈ ధర 90లక్షలు.

భల్లాల దేవుడు రానా దగ్గర ఆరు కార్లున్నాయి. బిఎం డబ్ల్యు ఎక్స్ 5కారు ధర 82లక్షలు. బెంజ్ ఎస్ క్లాస్ మోడల్ కారు ధర 2కోట్ల55లక్షల రూపాయలు. బెంజ్ సి క్లాస్ కారు ధర 49లక్షల75వేలు. స్కోడా కారు ధర 15లక్షలు. ఫోర్షియో కారు ధర 75లక్షలు. ఆడి ఏ 3మోడల్ కారు ధర 32లక్షలు. నేచురల్ స్టార్ నాని దగ్గర మొత్తం నాలుగు కార్లున్నాయి. రేంజ్ రోవర్ మోడల్ కారు ధర76లక్షలు. మెర్సిడెస్ బెంజ్ కారు 80లక్షలు. హోర్డ్ సిస్ట్ కారు ధర 8లక్షలు. ఆఖరుగా ఆడి క్యూ త్రీ కారు 40లక్షలు. అలాగే నితిన్ కి కూడా కార్లంటే చాలా ఇష్టం. అందుకే నాలుగు కార్లు దక్కించుకున్నాడు. జాగ్వార్ కారు 63లక్షల 78వేలు. బిఎం డబ్ల్యు ఎం 4 మోడల్ కారు ధర కోటిన్నర. బెంజ్ జిఎల్ 60మోడల్ కారు ధర 90లక్షలు. ఇక నాలగవ కారు ఆడి క్యూ 5మోడల్ కారు ధర 56లక్షల 21వేలు. హీరో నిఖిల్ దగ్గర మూడు కార్లున్నాయి. బెంజ్ స్కూప్ మోడల్ ధర 63లక్షలు. రేంజ్ రోవర్ ధర 80లక్షలు. ఇక మూడవ కారు పోర్న్ డి ఎన్ ఓ ధర కోటి 19లక్షలు.

స్టార్ స్టేటస్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కు 5కార్లున్నాయి. ఫోర్డ్ మస్టాంగ్ కారు ధర 74లక్షలు. బిఎం డబ్ల్యు 350డి కారు ధర 59లక్షలు. మెర్సిల్స్ జి 300 మోడల్ కారు ధర 52లక్షలు. ఆడి ఏ 6మోడల్ కారు ధర 54లక్షల రూపాయలు. ఆడి క్యూ 5మోడల్ కారు ధర 55లక్షలు. నాగ సౌర్య దగ్గర నాలుగు కార్లున్నాయి. ఫోర్షియో 718 కేమాన్ మోడల్ ధర 85లక్షల 95వేలు. మెర్సి లెస్ డిమ్ 350డి కారు ధర 88లక్షల 20వేలు. బ్లు జాగ్వార్ ఎక్స్ కె మోడల్ కారు 88లక్షలు. బిఎం డబ్ల్యు 520డి లగ్జరీ కారు 59లక్షల34వేలు. వరుణ్ తేజ్ దగ్గర ఆరు కార్లున్నాయి. ఫ్యామిలీ మొత్తం ఈ కార్లు వాడుతారు. వోల్వో ఎక్స్ సి 90మోడల్ కారు కోటి 20లక్షలు.మెర్సి లెస్ బెంజ్ క్లాస్ ధర కోటి 50లక్షలు. ఆడి క్యూ3 ధర 40లక్షలు. టయోటా ఇన్నోవా 30లక్షలు. కొండై వెన్నా కారు ఖరీదు 17లక్షలు. కోడా ధర 25లక్షలు. హీరో రామ్ దగ్గర 3కార్లున్నాయి. 90లక్షల విలువ చేసే రేంజ్ రోవర్, అలాగే58లక్షల బిఎం డబ్ల్యు ఎక్స్ 3కారు తో పాటు ,మెర్సి లెస్ బెంజ్ క్లాస్ ధర కోటి 36లక్షల కారుంది.