Movies

చిరంజీవిపై షాకింగ్ కామెంట్స్ చేసిన భానుచందర్…ఆలా అన్నాడే

ఒకప్పుడు కరాటే ఫైట్స్ తో అలరించిన హీరోల్లో సుమన్,భాను చందర్ లు ప్రధానంగా చెప్పుకోవాలి. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. అయితే భానుచందర్ అనగానే “జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై” అనే పాట ఠక్కున్న గుర్తొస్తుంది. అయితే భానుచందర్ తెలుగు, తమిళ భాషల్లో దాదాపు వంద చిత్రాల్లోకి పైగా నటించి తెలుగు ప్రేక్షకులను అటు తమిళ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.అయితే ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నాడు. అయితే తాజాగా భానుచందర్ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఎన్నో షాకింగ్ విషయాలు చెప్పాడు.

తనకు తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి మంచి స్నేహితుడని భానుచందర్ తెలిపాడు.అంతేగాక ఇప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవితో తనకి మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పుకొచ్చాడు.అలాగే గతంలో తనకు ద్విచక్ర వాహనం నడపడం రాదని ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తన తోటి మిత్రుడు మోటార్ సైకిల్ ని తీసుకొని నాకు వెంటనే దాన్ని ఎలా నడపాలో నేర్పించాడని పాత రోజులు గుర్తు చేసుకున్నాడు.అంతేకాక అప్పట్లో చిరంజీవిని ఒరేయ్, అరేయ్, అంటూ సంబోధించే అంత సన్నిహిత్యం తమ మధ్య ఉండేదని అన్నాడు.

కాకపొతే,రాను రాను చిరంజీవి తన జీవితంలో బిజీ అయ్యాడని తాను కూడా తన వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉండటంతో ఈ మధ్య తరచూ కలవలేక పోతున్నామని భానుచందర్ చెప్పుకొచ్చాడు. అలాంటి వ్యక్తి తనకు ఆప్త మిత్రుడుగా ఉండడం ఎంతో సంతోషకరమని చిరంజీవిపై ప్రశంసలు కురిపించాడు. అయితే ఇప్పటికీ ప్రతీ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా తన స్నేహితులంతా కలిసి సరదాగా గడుపుదామని గత సంవత్సరం కూడా చిరంజీవితో సరదాగా గడిపామని చెప్పుకొచ్చాడు.అలాగే చిరంజీవి చాలా సరదాగా ఉంటాడని అంతేగాక తమ అనుకున్న వారి కోసం ఏదైనా ఏమైనా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని తెలిపాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."