Movies

లాక్ డౌన్ ఎఫెక్ట్ : టెలివిజన్ వీక్షకులు భారీ స్థాయిలో పెరిగారట!

కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలో కూడా ప్రజల భద్రతా నిమిత్తం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే. దీనితో దాదాపు 90 శాతానికి పైగా ప్రజలకు ఇతర పనులు లేకపోవడంతో అంతా ఇళ్లకే పరిమితం అవుతున్నారు.

ఇళ్లల్లోనే ఉంటున్నారంటే ఊరికే ఉంటారా కుటుంబంతి కలిసి ఉంటారు కాబట్టి ఫుల్ గా బాతాఖాని కొట్టి టీవీల దగ్గరే కాలం గడుపుతున్నారు. మోడీ ఇచ్చిన 21 రోజుల లాక్ డౌన్ పూర్తి కాకుండానే మన దేశంలో టెలివిజన్ వీక్షకులు భారీ స్థాయిలో పెరిగారని టెలివిజన్ బ్రాడ్ క్యాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ సునీల్ లుల్లా వెల్లడించారు.

గడిచిన కొన్ని రోజుల్లోనే మన దేశంలో టెలివిజన్ వీక్షకుల శాతం ముందు ఉన్న దానికంటే 37 శాతం పెరిగిందట. అలాగే ప్రతీ రోజు మన దేశంలో 62 కోట్ల మందికి పైగా టెలివిజన్ ను వీక్షిస్తున్నారట అలాగే ఇదే సగటు ఈ లాక్ డౌన్ పూర్తయ్యే వరకు కొనసాగే అవకాశం ఉందని లుల్లా తెలుపుతున్నారు.