Movies

బన్నీ ఫ్యాన్స్ కు కూడా నిరాశ తప్పదా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఈ ఏడాది అద్భుతమైన శుభారంభాన్నే అందుకున్నారని చెప్పాలి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన “అల వైకుంఠపురములో” చిత్రం ఊహలకందని హిట్ కావడంతో బన్నీ ఫ్యాన్స్ యమా హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ సినిమా శకం ముగిపోయింది. ఇప్పుడు బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసమే వీరు ఎంత గానో ఎదురు చూస్తున్నారు.

కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు అనుకూలంగా లేవు సో సుక్కు తో సినిమా షూటింగ్ ఆగిపోయింది. కానీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాపై మరియు మేకర్స్ పై ఎన్నో ఆశలు పెట్టేసుకున్నారు. ఈ నెలలో అల్లు అర్జున్ పుట్టిన రోజు ఉంది దీనితో ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను ఎప్పటి నుంచో లాక్ చేసేసుకున్నారు. ఇప్పటికి ఎంతవరకు షూటింగ్ అయ్యిందో ఏమో కానీ ఫస్ట్ లుక్ కోసం మాత్రం వీరు బన్నీ పుట్టిన రోజు వరకు ఎదురు చూస్తున్నారు. మరి చిత్ర యూనిట్ ఏమన్నా ప్లాన్ చేశారో లేదో తెలియాల్సి ఉంది.