Movies

“రామరాజు ఫర్ భీమ్” ఒక రేంజ్ లో ఉండబోతుందా?

దర్శక ధీరుడు రాజమౌళి రౌద్రం రణం రుధీరమ్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరూ నటిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ పుట్టిన రోజున విడుదల అయిన భీమ్ ఫర్ రామరాజు వీడియో టాప్ ట్రెండ్ లో కొనసాగింది. రామ్ చరణ్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ప్రధాన ఆకర్షణ గా నిలిచింది. రామ్ చరణ్ ని రాజమౌళి ఒక రేంజ్ లో చూపించారు. అల్లూరి సీతారామరాజు ని డిఫెరెంట్ గా చూపించి రాజమౌళి మంచి మార్కులే కొట్టేశారు. అయితే ఇపుడు ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎదురు చూస్తున్నది ఎన్టీఆర్ వీడియో కోసమే.

రామరాజు ఫర్ భీమ్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున ఒక వీడియో విడుదల కానుంది అని తెలుస్తోంది. అయితే ఈ వీడియో లో రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఉండదట. జూనియర్ ఎన్టీఆర్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో కూడిన ఒక వీడియో ని విడుదల చేయనున్నారు. అయితే కొమరం భీమ్ అంటే ఇది అని గుర్తుండేలా రాజమౌళి చిన్న వీడియో ద్వారా అభిమానులకు పూనకం తెప్పించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి అభిమానుల అంచనాలను ఆ వీడియో అందు కుంటుందో లేదో చూడాలి. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తుండగా, ఈ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 8 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.