Movies

ఆచార్య నుంచి ఇంకో వికెట్ డౌన్…ఇలా జరగటానికి కారణం ఇదే…!

రాజకీయాల నుంచి టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలకు ధీటుగా తన సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ హాలీడేస్ కుటుంబంతో పాటు ఎంజాయ్ చేస్తున్నాడు. మరోపక్క సినీ రంగంలో పనులులేక ఇబ్బంది పడుతున్న వర్కర్స్ కోసం చారిటి తన సారధ్యంలో నడిపిస్తున్నాడు. దీనికి విరాళాలు వెల్లువెత్తున్నాయి. ఇక లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం కొరటాల శివతో ఆచార్య సినిమా వాయిదా పడింది. సైరా లాంటి హై ఓల్టేజ్ సినిమా తర్వాత చిరు చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే పెరిగిపోతున్నాయి. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక చాలా ఏళ్ళ తర్వాత చిరంజీవి సినిమాకు మరోసారి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఈ సినిమా నుంచి బయటికి వచ్చే వాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. మొన్నటికి మొన్న ఆచార్య నుంచి తప్పుకుంటున్నట్లు హీరోయిన్ త్రిష పోస్ట్ చేసింది. క్రియేటివ్ డిఫెరెన్సుల కారణంగానే ఈ చిత్రాన్ని వదిలేస్తున్నట్లు చెప్పింది. త్రిష కాదనుకున్న స్థానంలోకి కాజల్ వచ్చింది. ఈమెకు ఈ సినిమా కోసం దాదాపు 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది. ఈ సినిమా 2020లో విడుదల చేయాలనుకున్నా కూడా అనుకున్నప్పటికీ,లాక్ డౌన్ కారణంగా ఆలస్యం ఆవూతిన్నందున 2021 సమ్మర్‌కు వాయిదా వేసినట్లు టాక్. తాజాగా ఈ చిత్రం నుంచి ఎడిటర్ శ్రీకర ప్రసాద్ తప్పుకున్నట్లు టాక్. దీనికి ప్రత్యేకమైన కారణాలేవీ లేవు.

అనుకున్న సమయానికి షూటింగ్ కాకపోవడంతో తనకు ఇతర ప్రాజెక్టుల కారణంగా చిరు సినిమా శ్రీకర ప్రసాద్ వదిలేస్తున్నాడు. దర్శక నిర్మాతలతో పూర్తిగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆచార్య షెడ్యూల్స్ అనుకున్న దానికంటే కూడా కాస్త ఆలస్యం అవుతోంది కూడా. మరోవైపు ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మరింత లేట్ తప్పదు. శ్రీకర్ ప్రసాద్ వదిలేసిన స్థానంలో నవీన్ నూలిని ఎడిటర్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."