గ్లామర్ రోల్స్ ని వదిలేసిన బ్యూటీ…కారణం ఇంత పెద్దదా…?
‘అఆ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై ‘ప్రేమమ్’ సినిమాతో హీరోయిన్ గా ఎదిగిన అనుపమ పరమేశ్వరన్ తన అద్భుతమైన నటనతో క్యూట్ లుక్స్ తో జనానికి దగ్గరైంది. ఫాన్స్ ని సంపాదించుకుంది. ఇండస్ట్రీలోకి ప్రవేశించిన అనతికాలంలోనే అనుపమ తన క్రేజ్ తో వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ వస్తుంది. అంతేకాదు, మొదటి సినిమా నుండి సొంతంగా తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకుంటూ, తెలుగులో దాదాపు యంగ్ హీరోల అందరితో నటించింది.
శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమకోసమే లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుపమ ఇటీవలే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం తెలుగు నిన్నుకోరి మూవీ తమిళ రీమేక్ లో నటిస్తున్న ఈ మలయాళం బ్యూటీ కొన్ని మలయాళం సినిమాలను కూడా ఈ అమ్మడు ఓకే చేసిందట. అయితే సోషల్ మీడియాలో తాజాగా అనుపమ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది.
అనుపమ రీసెంట్ గా లేడీ ఓరియెంటెడ్ మూవీ ఓకే చేసిందట. ఈ సినిమాతో హనుమాన్ చౌదరి అనే కొత్త దర్శకుడు సినీ ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. అయితే మూవీ టైటిల్ ని ఫిక్స్ చేయలేదట. ఇంకా పూర్తి తారాగణం కూడా సెలక్ట్ చేయాల్సి ఉంది. ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్ర చేయబోతోందట. ఈ సినిమాలో అనుపమ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా డిమాండింగ్ గా ఉండబోతుందట. అధికారికంగా ప్రకటించని అనుపమ కొత్త సినిమా గురించి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
