సాయాజి షిండే సినిమాల్లోకి రాకముందు ఏమి చేసే వాడో తెలుసా?
మాయ ప్రపంచంగా చెప్పుకునే సినిమా ఇండస్ట్రీ విచిత్రమైనది. వారసత్వంగా వచ్చినా, బ్యాక్ గ్రౌండ్ లేకున్నా సరే, అందం ,అభినయం తో టాలెంట్ ఉండాలి. అన్నింటికి లక్కుండాలి. తినడానికి తిండి లేనివాళ్లకు కోట్లు తీసుకొచ్చి పెడుతుంది. ఎంత డబ్బున్నా దిగడుపే అన్నట్లు చేస్తుంది. అందుకే సినిమా చాలా మంది జాతకాలు మార్చేస్తుంది. ఒకప్పుడు ఏమీలేని వాడు, సినిమా వలన డబ్బు కూడబెడితే, సక్సెస్ సొంతం చేసుకుంటే, ఆ తర్వాత అందరూ అతడి చెప్పుకుంటారు. కానీ వాళ్లు ఆ సక్సెస్ కావడానికి ఎంత టైమ్ పట్టింది.. ఎన్నేళ్లు కష్టపడ్డారు అనేది మాత్రం చాలా మందికి తెలియదు.
ఇక అసలు విషయానికి వస్తే, .. తెలుగు ఇండస్ట్రీతో పాటు మరో నాలుగు భాషల్లో సత్తా చాటి, ఎన్నో వందల సినిమాల్లో నటించిన సాయాజి షిండే అనగానే చాలా సినిమాల్లో అతడి నటన కళ్ళముందు కనిపిస్తుంది. కానీ అతడు ఒకప్పుడు వాచ్‌మెన్‌గా పని చేసాడని చాలామందికి తెలియదు. సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఆయన మూడేళ్ల పాటు ఒక కాలేజ్ వాచ్ మెన్‌గా పని చేసాడు.పేరుకు మరాఠీ నటుడు అయినప్పటికీ తెలుగులో తన డబ్బింగ్ తానే చెప్పుకుంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ‘తిన్నామా పడుకున్నామా తెల్లారిందా..’, ‘లారీ ఢీ ముగ్గురు ఠా..’ అంటూ పోకిరి సినిమాలో యితడు చెప్పిన డైలాగులు అందరికీ గుర్తే.
దానికంటే ముందే చిరంజీవి ఠాగూర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన షిండే ఆ తర్వాత 50 సినిమాలకు పైగా నటించాడు. అందులో 90 శాతం సినిమాల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకొన్నాడు. అయితే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ విషయాల గురించి చెబుతూ, తాను మహారాష్ట్రలో పుట్టానని, తనది చాలా పేద కుటుంబం అని చెప్పాడు. తన ఊర్లో ఏడో తరగతి వరకు చదువుకున్న తర్వాత పక్క ఊరికి వెళ్లి టెన్త్ కంప్లీట్ చేసి ఆ తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యానని, అక్కడ ఫీజు కోసం అదే కాలేజీలో మూడేళ్లపాటు వాచ్ మెన్‌గా చేశానని చెప్పాడు షిండే. పగలు చదువుకోవడం రాత్రి అదే కాలేజీలో వాచ్ మెన్‌గా చేస్తూ, ఆ వచ్చిన డబ్బులతో ఫీజ్ పట్టుకోవడంతో పాటు తన నెలసరి ఖర్చులు చూసుకునేవాడినని వివరించాడు.

