Movies

పవర్ స్టార్ తొలి సినిమా సీక్రెట్స్…ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో…?

మెగాస్టార్ చిరంజీవి తమ్మునిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ సొంతంగా ఓ ఇమేజ్ తెచ్చుకుని పవర్ స్టార్ గా ఎదిగిన పవన్ కళ్యాణ్ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో కొలువయ్యాడు. అయితే పవన్ ని పర్ఫెక్ట్‌గా లాంఛ్ చేయడానికి చిరంజీవి తీసుకున్న జాగ్రత్తలు చాలానే ఉన్నాయట. తమ్ముణ్ణి ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి చాలా మంది దర్శకులను చెక్ చేసుకున్న తర్వాత చివరికి ఈవీవీ సత్యనారాయణ కుదిరాడు. అప్పటికే హిందీలో వచ్చి సూపర్ హిట్ అయిన ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాను తెలుగులో ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు గా ఈవీవీ రీమేక్ చేసాడు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా కూడా అక్కినేని మనుమరాలు సుప్రియను తీసుకుని మెగా, అక్కినేని కుటుంబాల అభిమానులను ఈవీవీ ఆకట్టుకునే ప్రయత్నంతో పాటు,పవన్ పోస్టర్ డిజైన్స్, ప్రమోషన్స్ కూడా చాలా కొత్తగా చేసాడు. అప్పట్లో చేసిన ప్రమోషన్స్ చూసి అంతా షాక్ అయ్యారు. ముందుగా పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోలతో ఈ అబ్బాయి ఎవరు అంటూ వాల్ పోస్టర్స్ అంటించారు. సినిమా విడుదలకు ముందు ఇతడే మన కళ్యాణ్ అంటూ మరో పోస్టర్స్ రిలీజ్ అయింది. ప్రేక్షకుల్లో కూడా సహజంగా ఆతృత పెరిగింది.

ఇక చిరంజీవి తమ్ముడు అంట అంటూ ఈ మూవీపై అంచనాలు కూడా రెట్టింపయ్యాయి. అలా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ రిలీజయింది. ఈ సినిమా మొదట్లో కూడా ఇతడే మనకు కావాల్సిన కళ్యాణ్ బాబూ అంటూ దర్శకుడు ఈవీవీ చూపించాడు. ఇలా ప్రతీ విషయంలోనూ పవన్‌ను అద్భుతంగా ప్రమోట్ చేసాడు. ఇక పవన్ చేసిన రియల్ ఫీట్స్ సినిమాకు అదనపు ఆకర్షణ. ఈ సినిమాలో అప్పటి స్టార్ హీరోయిన్ రంభ కూడా ఓ ఐటం సాంగ్ చేసింది. ఇండస్ట్రీలోని ప్రముఖ నటులు, కమెడియన్స్ అంతా ఈ సినిమాలో నటించారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి యావరేజ్ గా ఆడినప్పటికీ, పవన్ కెరీర్‌కు మంచి పునాది పడింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."