Movies

పవన్ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన ‘బంగారం’ సినిమాలో నటించిన అందాల భామ మీరా చోప్రా గుర్తుందా? అదేనండీ, నితిన్‌ సరసన ఓ సినిమాలో కూడా చేసిందీ చోప్రా బ్యూటీ. సౌత్‌లో రకరకాల పేర్లతో సినిమాలు చేసి, ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘మీరా చోప్రా’గా సెటిలైపోయిన ఈ ‘బంగారు మేని’ భామ, ప్రస్తుతం పెద్దగా సినిమా ఛాన్సుల్లేక.. సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ ఫొటోలతో టైమ్ పాస్‌ చేస్తోంది. బాలీవుడ్‌లో ‘చోప్రా’ ట్యాగ్‌లైన్‌ పెట్టుకుని కొన్ని సినిమాలు అయితే దక్కించుకుందిగానీ, అవేమీ ఆమెకి పెద్దగా హిట్లు ఇవ్వలేకపోయాయి. దాంతో, ఈ బ్యూటీ మనసు ఇప్పుడు వెబ్‌ సిరీస్‌లవైపు అడుగులేస్తోందట.

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్ పై ఓ ఊపేసిన ‘లస్ట్‌ స్టోరీస్‌’ తరహా వెబ్‌ సిరీస్‌ ఒకటి ఓ ప్రముఖ నిర్మాత సారధ్యంలో రూపొందనుందనీ, అందులో మీరా చోప్రా ఓ హాట్‌ రోల్‌లో కన్పించబోతోందనీ తెలుస్తోంది. ఈ వెబ్‌ సిరీస్‌ కోసం మీరా చోప్రా కాస్త గట్టిగానే రెమ్యునరేషన్‌ ఛార్జ్‌ చేస్తోందని సమాచారం. ‘అందులో కంటెంట్‌ అలాంటిది మరి..’ అంటున్నారు బాలీవుడ్‌ సినీ జనం. వెబ్‌ సిరీస్‌లకు సెన్సార్‌ వుండదు. దాంతో, ఏ స్థాయిలో అయినా ‘హాట్‌ కంటెంట్‌’ని చిత్రీకరించేయొచ్చు. పైగా, ఇప్పుడు టాప్‌ హీరోయిన్లు కూడా, హద్దులు దాటిన శృంగారానికి ఓకే చెప్పేస్తుండడంతో వెబ్‌ సిరీస్‌ల ట్రెండ్‌ ఓ రేంజ్‌లో నడుస్తోంది. సో, అతి త్వరలో మీరా చోప్రాని హాట్‌ హాట్‌గా వెబ్‌ సిరీస్‌లో చూసెయ్యబోతున్నామన్నమాట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."