Movies

పుష్పలో ఐటెం సాంగ్ కోసం ఎవరిని దింపుతున్నారో తెలుసా?

సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో మూడో సినిమాకి రంగం సిద్ధమైంది.సుకుమార్ గత సినిమాల తరహాలో స్టైలిష్ గా కాకుండా రంగస్థలం తరహాలో పక్కా మాస్ యాంగిల్ లో ఈ సారి బన్నీని చూపించబోతున్నాడు.ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసి సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయంపై సుకుమార్ క్లారిటీ ఇచ్చేశాడు.చిత్తూరు నేపధ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలిమెంట్ తో ఈ కథ ఉండబోతుంది అని తెలుస్తుంది.పుష్ప టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర పేరు పుష్పరాజ్ అని సుకుమార్ డిసైడ్ చేశాడు.

రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ కి సాలిడ్ హిట్ ఇచ్చిన సుకుమార్ అంతకు ముందు క్లాస్ యాంగిల్ చూపించి ఒక్కసారిగా తనలోనే మాస్ మసాలా దర్శకుడుని పరిచయం చేసాడు.ఈ సారి కూడా పుష్పరాజ్ తో మరో మాస్ ఎంటర్టైన్మెంట్ తో ఆవిష్కరించబోతున్నాడు.ఇదిలా ఉంటే రంగస్థలంలో జిగేలు రాణి తరహాలోనే ఇందులో చిత్తూరు యాసలో సాగే ఒక మాస్ బీట్ ని సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ సాంగ్ ని ఫోక్ గాయకుడు పెంచల్ దాస్ తో రాయించబోతున్నారని సమాచారం.అలాగే ఈ సాంగ్ కోసం పూజా హెగ్డే తరహాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దించబోతున్నారని తెలుస్తుంది.ఇప్పటికే ఒక ఇద్దరు పేర్లు పరిశీలించినట్లు టాక్ నడుస్తుంది.మరి వారిలో ఎవరిని సుకుమార్ ఫైనల్ చేస్తాడు అనేది వేచి చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."