Movies

ఈ స్టార్ హీరోని గుర్తు పట్టారా… అయితే వెంటనే చూసేయండి

టాలీవుడ్ సినీ పరిశ్రమలో నందమూరి హీరో యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ కి ఉన్నటువంటి పాపులారిటీ మరియు ఫేమ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.అంతేకాక టాలీవుడ్ లో అత్యధికంగా సక్సెస్ రేటు ఉన్నటువంటి టాప్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకడు.అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ ఫోటో నెట్లో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ ఫోటో ఏంటంటే చిన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పాఠశాలలో చదువుతున్న సమయంలో తన స్నేహితులు మరియు ఉపాధ్యాయుడుతో కలిసి తీసుకున్నటువంటి ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. దీంతో యంగ్ టైగర్ అభిమానులు కూడా ఈ ఫోటోని బాగానే వైరల్ చేస్తున్నారు.అంతేగాక ఈ ఫోటోలో చిన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎంత చలాకీగా ఉండే వాడో తెలుస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో తారక్ స్వతంత్ర ఉద్యమ సాయుధ బలగాల్లో పోరాటం చేసినటువంటి కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

అలాగే ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నటువంటి మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించినటువంటి షూటింగ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."