Movies

అల్లు అర్జున్ విషయం లో సుకుమార్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా?

సుకుమార్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్ర విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు సుకుమార్. అయితే ఈ రెండు చిత్రాలు రివెంజ్ డ్రామా గా తెరకె క్కాయి. అంతేకాక ఈ సినిమాల్లో హీరోలో గుబురు గెడ్డలతో కనిపించారు. గెటప్ కు ఎలా ఉన్న సుకుమార్ తన మార్క్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకలను కట్టి పడేస్తారు. అయితే ఇపుడు అల్లు అర్జున్ వంతు. ఆర్య, ఆర్య 2 చిత్రాల్లో సుకుమార్ అల్లు అర్జున్ ని చాలా స్టైలిష్ గా సూపర్ గా చూపించారు. అయితే తాజాగా విడుదల అయిన పుష్ప ఫస్ట్ లుక్ లో ఊర మాస్ గా కనిపించారు.

అలా వైకుంఠ పురంలో బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ చిత్రం పై అభిమానులు మొదటినుండి భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే అల్లు అర్జున్ ఇప్పటి వరకు నటించని పాత్రలో కనిపించనున్నారు. ఎర్ర చందనాలు స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్ కనిపించనున్నారు. అయితే మాస్ పల్స్ పట్టుకున్న సుకుమార్ ఇపుడు మరకోసారి తనదైన దర్శకత్వ ప్రతిభను చూపించను న్నారు. అయితే ఇది పాన్ ఇండియా తరహాలో తెరకెక్కనుంది. అల్లు అర్జున్ ఫస్ట్ టైమ్ తనకిష్టమైన దర్శకుడితో భారీ ప్రాజెక్ట్ ని చేస్తున్నారు. మరి సుకుమార్ బన్నీ ని ప్రత్యేకంగా చూపించి అభిమానులని అలరిస్తా డో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే చాలా గాప్ తీసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ కొట్టాడు బన్నీ, మరి సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్ర చిత్రం ఎలాంటి ఫలితం రాబ ట్టుతుందో చూడాలి.