Movies

నితిన్ అభిమానులు ఏమి చేసారో తెలుసా?

మన టాలీవుడ్ టైర్ 2 హీరోల్లో టాప్ ప్లేస్ లో ఉండే హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది నితిన్ అనే చెప్పాలి. ఎన్నో ఏళ్ల పాటుగా ప్లాప్స్ చవి చూసినా అలుపు లేని కెరటంలా ఎప్పుడు ఎగిసి పడుతూనే ఉన్నాడు.దీనికి కారణం ముమ్మాటికి అతని అభిమానులే అని చెప్పాలి. అన్నేళ్లు సరైన హిట్ పడకపోయినా సరే నితిన్ వెన్నంటే ఉండి తమ విధేయతను చాటుకున్నారు.

అయితే నితిన్ ఒక్క హీరోగానే కాకుండా వ్యక్తిగా కూడా ఎంత ఉన్నతమైన వారని మరోసారి నిరూపించుకున్నారు. ఇటీవలే కరోనా కారణంగా సినీ పరిశ్రమలో పని చేసే కార్మికులు పడే ఇక్కట్లను దూరం చెయ్యడని తన వంతు సాయంగా మొత్తం 25 లక్షలు రూపాయలను విరాళంగా ఇచ్చి మన టాలీవుడ్ నుంచి మొదటి అడుగు వేశారు.

అలాగే దీనితో పాటుగా ఇప్పుడు మరో మంచి పని చేసి నితిన్ తన సేవా భావాన్ని చాటుకున్నారు. ఇప్పుడు నితిన్ బాటలోనే తన అభిమానులు కూడా నడుస్తున్నారు. హైదరాబాద్ లో దాదాపు 300 మందికి పైగా ఆహారాన్ని అందించి తమ అభిమాన హీరో ను మరో మెట్టు ఎక్కించిన వారయ్యారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."