బిజీగా మారిన కాజల్…చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో?
ఇప్పటి పరిస్థితుల్లో పదేళ్లు తిరక్కుండానే హీరోయిన్ గా కెరీర్ ఫుల్ స్టాప్ పెట్టేసి పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అయితే కెరీర్ మొదలై 12 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు తో కాజల్ అగర్వాల్ దూసుకెళ్తోంది. ఇప్పటికీ వరుస సినిమాలతో అదరగొడుతోనే ఈ అందాల చందమామ ఓ వైపు కుర్ర హీరోలతో నటిస్తూనే సినీయర్స్ తో కూడా రొమాన్స్ చేస్తోంది. కాజల్ ప్రస్తుతం ‘ముంబై సాగా అనే హిందీ సినిమాలో నటిస్తుండగా.. మరోవైపు కమల్ హాసన్ హీరోగా వస్తోన్న ఇండియన్ 2’ చిత్రంలో కీలక పాత్రలో చేస్తోంది.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో వస్తోన్న ‘ఆచార్య’లో చిరంజీవి సరసన నటించే ఛాన్స్ కాజల్ కొట్టేసింది. ఇలా మొత్తం మూడు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్న ఆమె చేతికి మరో భారీ చిత్రం కూడా వస్తోందట. తమిళ సూపర్ స్టార్ విజయ్, మురుగదాస్ కాంబినేషన్లో ‘తుపాకి 2’ లో హీరోయిన్గా కాజల్ నటించే ఛాన్స్ ఉందట. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన తుపాకి మంచి విజయం సాధించింది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కాజల్‌కు మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్న కాజల్ లేటెస్ట్గా చిరు తమ్ముడు పవన్‌కళ్యాణ్ సరసన కూడా నటించే లక్కీ ఛాన్స్ అంది పుచ్చుకుంది. పవన్‌కళ్యాణ్, హరీష్‌శంకర్ కాంబినేషన్లో త్వరలోనే పట్టాలెక్కనున్న ఓ సినిమాలో కూడా కాజల్‌నే చిత్రబృందం ఎంపిక చేశారట. గతంలో పవన్, కాజల్ కాంబినేషన్లో వచ్చిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రంలో ఈ ఇద్దరూ జోడీ కట్టి అలరించిన నేపథ్యంలో ఈ సినిమాలో కూడా కాజల్ ని సెలెక్ట్ చేశారట.
