Movies

యాంకర్ అనసూయ పేరు వెనుక ఎంత పెద్ద సీక్రెట్ ఉందో తెలుసా?

పేరు లో ఏముంది అంటారు కానీ పేరు ఏదైనా మనిషిని బట్టి పేరుకు వేల్యూ పెరుగుతుంది. అందుకు తార్కాణం అనసూయ. పేరు ఎప్పుడో పాతకాలం పేరే అయినా అమ్మాయి మాత్రం ఆల్ట్రామోడ్రన్‌ అని చెప్పాలి. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందం అనసూయ సొంతం. ప్రస్తుతం యాంకర్‌గానే కాకుండా నటిగా కూడా వరస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది ఈ జబర్దస్త్ భామ. అయితే పేరు మాత్రం అలా ఉందేంటని చాలా మందిలో ఓ అనుమానం కూడా ఉంది. కొత్తగా షో గా ఉండేలా పేరు పెట్టుకోవచ్చు .

పోనీ చిన్నప్పుడు పెడితే పెట్టారు కానీ, కనీసం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతైనా మార్చుకోవచ్చు కదా అంటూ చాలా మంది ఈమెకు ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. కానీ అనసూయ మాత్రం దానికి ససేమిరా అంటోంది. ఇప్పటికీ తన పేరంటే తనకు చాలా యిష్టం అని సగర్వంగా చెబుతోంది. అసలు ఈ రోజుల్లో ఉండాల్సిన పేరు కాదు కదా, మరి ఎందుకు ఇంత పాత పేరు పెట్టుకున్నారు మీరు అంటూ చాలా మంది ఈమెను మొహం మీద అడిగేసారు. అన్నిసార్లు నవ్వుతూనే సమాధానమిచ్చిన అనసూయ ఇప్పుడు ఈ పేరు వెనక ఉన్న కథేంటో బయటపెట్టింది. కరోనా ఎఫెక్ట్ తో ఇంట్లోనే ఉండిపోవడంతో రోజూ అభిమానులతో ఈ ముద్దుగుమ్మ ముచ్చటిస్తూనే ఉంది.

ఎవడైనా ఎక్స్‌ట్రాలు చేస్తే, సోషల్ మీడియాలో అందరి ముందు కడిగేస్తుంది. దాంతో పాటే వ్యక్తిగత విషయాలను కూడా దాచుకోకుండా పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో తన పేరు వెనక మిస్టరీని కూడా ఈ భామ చెప్పేసింది. తనకు నాన్నమ్మ పేరు పెట్టారని అనసూయ చెప్పింది. నాన్నకు వాళ్లమ్మ అంటే చాలా యిష్టమని, అందుకే తనకు ఈ పేరు పెట్టుకున్నాడని చెప్పింది. చాలామంది ఈ పేరు పాతగా ఉందని చెప్పినా కూడా అద్భుతంగా ఉందంటూ పొగిడారని గుర్తు చేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చాక కూడా తన పేరుతో ఎప్పుడూ సమస్య రాలేదని అందుకే కంటిన్యూ అయిందని చెప్పుకొచ్చింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."