ప్రభాస్, మహేష్‌లు నో అంటే బన్నీ ఓకే అంటాడా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన తాజా చిత్రం ‘పుష్ప’ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.ఇప్పటికే షూటింగ్ కూడా మొదలుపెట్టుకున్న ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.బన్నీ-సుక్కు కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే.
ఈ రెండు సినిమాల తరువాత మూడోసారి ఈ కాంబో వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.పుష్ప అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడా అనే అంశం కూడా అప్పుడే హాట్ టాపిక్‌గా మారింది.ఇప్పటికే మహేష్ బాబు, ప్రభాస్‌లకు కథ వినిపించిన అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో బన్నీ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తాడనే వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.
అయితే ప్రభాస్, మహేష్ రిజెక్ట్ చేసిన కథను బన్నీ ఓకే చేస్తాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్‌గా మారింది.ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న బన్నీ సందీప్ రెడ్డి వంగాతో రిస్క్ చేస్తాడా లేదా అనేది చూడాలి.ఏదేమైనా ఈ కాంబో కుదిరితే ఆ సినిమా ఎలా ఉంటుందో అని బన్నీ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

