Movies

ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రభాస్ కోసం అంత డిమాండ్ చేసిందా…?

బాలీవుడ్లో గ్లామర్ క్వీన్ దీపికా పదుకొనే కి ఉన్నటువంటి క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే.అయితే ఈమె పాత్ర ఏదైనా సరే అందుకు తగ్గట్టుగా హావభావాలు పలికిస్తూ ప్రేక్షకులను కత్తి పడేయడం ఈమె స్పెషాలిటీ.అయితే కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో రణవీర్ సింగ్ ని పెళ్లి చేసుకుంది.దీంతో ప్రస్తుతం దీపికా పదుకొనే అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది.

అయితే తాజాగా దీపికా పదుకొనే గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇంతకీ ఆ వార్త ఏంటంటే ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే అయితే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా చిత్ర యూనిట్ సభ్యులు దీపికా ని సంప్రదించారట.కాగా ఈ చిత్రంలో నటించడానికి దీపికా పదుకొనే దాదాపుగా 25 కోట్ల రూపాయలు పారితోషకం డిమాండ్ చేసిందట.దీంతో చిత్ర బడ్జెట్ ఎక్కువుతుండడటంతో ప్రస్తుతం దీపికా పడుకొనే పేరుని పక్కన పెట్టినట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దీపికా పదుకొనే 83 అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.
ఈ చిత్రంలో హీరోగా రణవీర్ సింగ్ నటిస్తున్నాడు.ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి చిత్రీకరణ పూర్తయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."