Movies

ఆస్కార్ విన్నింగ్ కల్ట్ క్లాసిక్ “జోకర్” అమెజాన్ ప్రైమ్ లో…ఎప్పుడంటే

మన ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది జనం ఆధారపడే ఏకైక ఎంటర్టైన్మెంట్ రంగం ఏదన్నా ఉంది అంటే అది ముమ్మాటికీ సినిమా రంగమే అని చెప్పాలి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు అందరినీ మెప్పించే ఒక సినిమా రావడం కూడా అరుదే అని చెప్పాలి. అలాంటి ఒక అరుదైన సినిమాయే “జోకర్”. అసలు ఈ జోకర్ అనే పాత్రకే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు.

ఇది ఒక బ్రాండ్ లా మారిపోయింది అంతే.. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు జోకర్ రోల్ ఒక రోల్ మోడల్ అంతే.. అలా జాక్వీన్ ఫోరెక్స్ హీరోగా నటించిన జోకర్ సినిమా గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యి బాక్సాఫీస్ దగ్గర కనక వర్షాన్ని కురిపించింది.ఈ సినిమాలో ఫోనిక్స్ నటనకు గాను అతన్ని ప్రపంచ ప్రఖ్యాత అవార్డు ఆస్కార్ వరించింది.

అలాగే మన దేశంలో కూడా భారీ హిట్ అయ్యింది. దీనితో ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు ఎప్పటి నుంచో భారీ డిమాండ్ ఏర్పడింది. దీనితో ఈ సినిమా ఏ డిజిటల్ యాప్ లో వస్తుందా అని ఎదురు చూసారు. కానీ ఇప్పుడు దానికి తెర పడింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏప్రిల్ 20 నుంచి స్ట్రీమ్ అవ్వబోతుంది. మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా జోకర్ సినిమా కల్ట్ ఫ్యాన్స్ కు ఇది ఒక శుభ వార్తే అని చెప్పాలి.