స్ట్రీమింగ్ యాప్ తో మహేష్?అప్పుడే వైరల్ అవుతున్న యాప్ పేరు.!
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన సరికొత్త ఇన్నింగ్స్ మొదలు పెడతారని కొన్ని వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే..అదే తన భార్య తాను కలిసి కొన్ని వెబ్ సిరీస్ లను నిర్మించాలని అనుకున్నారని వార్తలు వినిపించాయి.అయితే ఇప్పుడు ఇదే రంగానికి సంబంధించి మరో సరికొత్త వార్త ఇప్పుడు వినిపిస్తుంది. మహేష్ ఇప్పుడు తన స్వీయ స్ట్రీమింగ్ యాప్ ను చేస్తే విడుదల చేసే యోచనలో ఉన్నట్టు బజ్ వినిపిస్తుంది.
దీనికి గాను మహేష్ ఒక వినూత్నమైన పేరును కూడా అనుకుంటున్నారని తెలుస్తుంది. మహేష్ ఈ యాప్ కు తన కూతురు సితార పేరులోని మొదటి రెండు అక్షరాలు అలాగే కొడుకు గౌతమ్ పేరులోని మొదటి అక్షరం.
అలాగే తన పేరులోని మొదటి రెండు అక్షరాలతో “సిగ్మ” అనే యాప్ ను లాంచ్ చేయనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనితో మహేష్ అభిమానులు ఈ వార్త నిజమా కాదా అన్న డైలమా లో పడ్డారు.
