షాకింగ్ నిర్ణయం తీసుకున్న కొరటాల…మరి హీరోల పరిస్థితి ఏమిటో ?

కొరటాల శివ ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ డిమాండ్ ఉన్న దర్శకుడు. ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో అపజయం అనే మాటే ఎరుగడు. అయితే కొరటాల ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి తో ఆచార్య చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చిరు ని చాలా పవర్ ఫుల్ గా చూపించనున్నారు. ఇప్పటివరకు మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ లతో తీసిన కొరటాల ఇపుడు మెగా స్టార్ తో సినిమా చేసేందుకు భారీ గా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు తీసిన ప్రతి సినిమా అంతా గట్టిగా జనాల్లోకి వెళ్ళింది. అయితే ప్రస్తుతం కొరటాల శివ కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

కొరటాల శివ ఈ సినిమా తర్వాత కేవలం మరొక అయిదు చిత్రాలు తీసి, ఆ తర్వాత దర్శకత్వంలో రిటైర్ మెంట్ ప్రకటిస్తా రట. అయితే ఈ విషయం పై కొరటాల పూర్తి క్లారిటీ గా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా నా వద్ద చాలా తక్కువ కథలు ఉన్నాయని, అవి పూర్తయ్యాక ఇక దర్శకత్వం మానేస్తా అని అన్నారు. అయితే దర్శకత్వం ఆపేసీ, సినిమాలు నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర దర్శకులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక తన కుటుంబం తో కూడా ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే కొరటాల ఒక్కొక్క సినిమా కోసం కనీసం ఒక్క సంవత్సరం సమయం పడుతుంది. అంటే ఇంకా 5 సంవత్సరాల్లో మిగతా అయిదు సినిమాలు తీయనున్నారు. మరి ఈ విషయాల పై కొరటాల ఎపుడు స్పందిస్తారో చూడాలి.