Movies

సౌందర్య సంపాదించిన కోట్ల ఆస్తులు ఎవరికీ దక్కాయో తెలుసా?

ఈ తరం ప్రేక్షకులకు సావిత్రి అంటే ఎలా ఉంటుందో సినిమాల్లో మాత్రమే చూసారు. కానీ నటన పరంగా చూసుకుంటే ఆ సావిత్రి అచ్చంగా ఇలాగే ఉండేదేమో అనేంతగా సౌందర్య అందర్నీ మాయ చేసింది. అందుకే తెలుగునాట అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న సౌందర్య దురదృష్టవశాత్తు కేవలం 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది. సరిగ్గా 16 ఏళ్ల కింద 2004న ఎప్రిల్ 17, సౌందర్య మరణించారు. అప్పటికి ఈమె వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. పైగా పెళ్లై ఏడాది కూడా కాకముందే ఆమె మరణించడం నిజంగానే విషాదం నింపేసింది.

ఈమె భౌతికంగా దూరమై 16 ఏళ్లు గడిచినా కూడా ఇంకా సౌందర్య అంటే ప్రేక్షకుల మనసుల్లో అలాంటి స్థానమే ఉంది. 100కు పైగా సినిమాల్లో నటించిన సౌందర్యకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అభిమానులున్నారు. పేరుకు కన్నడ కస్తూరి అయినా కూడా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది . అప్పట్లోనే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న సౌందర్యకు ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయంటారు. అప్పటి లెక్క ప్రకారమే దాదాపు 100 కోట్ల ఆస్తులు సౌందర్యకు ఉన్నట్లు అప్పట్లో కుటుంబ సభ్యులే చెప్పారు.ఇక ఇప్పటికీ ఈమె ఆస్తులపై గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తన సోదరుడు అమరనాథ్ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు సౌందర్య చేపట్టారు.

అయితే ప్రమాదంలో ఇద్దరూ ఒకేసారి మరణించడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. ఇప్పటికీ సౌందర్య ఇంటి నుంచి ఆమె స్థాపించిన కొన్ని విద్యాలయాలకు నిధులు వెళ్తూనే ఉన్నాయి. సౌందర్య చనిపోయిన కొన్ని నెలలకే కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఆమె ఆస్తి కోసం భర్త రఘు కూడా చాలా ప్రయత్నాలు చేసాడు.తాను చనిపోయే ఏడాది ముందే అంటే 2003 ఫిబ్రవరి 15న సౌందర్య వీలునామా రాశారని.. అందులో ఉన్నదాని ప్రకారమే తమకు కూడా ఆస్తులు పంచాలని అమర్ నాథ్ భార్య నిర్మల.. ఆమె కుమారుడు సాత్విక్ 2009లో బెంగళూరులోని మెజిస్టేట్ కోర్టును ఆశ్రయించారు. అయితే సౌందర్య ఎలాంటి వీలునామా రాయలేదని.. నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీలునామా సృష్టించారని సౌందర్య తల్లి మంజుల, రఘు కోర్టుకు విన్నవించారు. అప్పటి నుంచి కోర్టులో నే నడుస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."