“పుష్ప” పై ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టిన రష్మికా.?
ఇప్పుడు మన టాలీవుడ్ లో మోస్ట్ లక్కీయేస్ట్ హీరోయిన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది రష్మికా మందన్నా కూడా ఒకరు. తాను హీరోయిన్ గా చేసిన ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతా అన్ని సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఆ విధంగా రష్మికా మన టాలీవుడ్ లో లక్కీ హ్యాండ్ గా మారిపోయింది.
ఆ సెంటిమెంట్ తోనే అతి తక్కువ సమయంలోనే ఆమెకు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశం వచ్చింది. అలా ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ లాంటి పెద్ద కాంబో లోనే నటించే అవకాశాన్ని ఇప్పుడు కొట్టేసింది. అయితే ఈ సినిమా కోసం రష్మికా కొన్ని ఆసక్తికర విషయాలని వెల్లడించినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో దర్శకుడు సుకుమార్ తన కోసం ఒక అద్భుతమైన పాత్ర తీర్చిద్దారని అంతే కాకుండా ఈ సినిమా స్టోరీ లైన్ కూడా చాలా యూనీక్ గా ఉంటుందని రష్మికా తెలిపింది అంతే కాకుండా ఈ సినిమా తన కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలుస్తుంది అని నమ్మకంగా చెప్తున్నారు. మరి సుక్కు ఎలా ప్లాన్ చేసారో చూడాలి.
