Movies

చిరు తీసుకున్న నిర్ణయానికి షాక్ లో ఉన్న అభిమానులు!

మెగాస్టార్ చిరంజీవి లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. దొరికిన సమయం అంతా భవిష్యత్ ప్రణాళిక పైనే పూర్తి శ్రద్ద పెడుతున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు లేవు. అయితే ఇదే సమయంలో చిరు తాను కొరటాల శివ తర్వాత చేయబోయే చిత్రాల సంఖ్యను పెంచినట్లు తెలుస్తోంది. తాజాగా చిరు తన ఇంట్లోనే కొంతమంది తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ లిస్ట్ లో కొరటాల శివ తో పాటుగా సాహొ సుజిత్, బాబీ లతో సినిమాలు చేస్తున్నట్లు ఇదివరకు తెలిసిందే. అయితే తాజా గా ఈ లిస్టులో మెహర్ రమేష్ జాయిన్ అయ్యారు.

మెహర్ రమేష్ ఒక్క బిల్లా మినహా అన్ని చిత్రాలు ఫ్లాప్. బిల్లా కూడా రీమేక్ మూవీ అవ్వడం తో కొంత కలిసి వచ్చింది. అయితే ఇపుడు మెగా అభిమానులు ఒక ఫ్లాప్ దర్శకుడితో చిరు సినిమా ఎంటి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. చిరు వీరితో పాటుగా హరీశ్ శంకర్, సుకుమార్, పరశురామ లాంటి దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వారు కొత్తగా చూపించే అవకాశం ఉందని చిరు తెలిపారు. వాళ్ళ పని తీరు పట్ల చిరు చాలా ఆసక్తి చూపుతున్నారు. మరి లాక్ డౌన్ తర్వాత చిరు ఏ చిత్రాన్ని అనౌన్స్ చేస్తారో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."