ఒకే నెలలో నాలుగు బ్లాక్ బస్టర్స్ …సినిమాలు ఏమిటో తెలుసా?
సినీ చరిత్రలో ఒకే నెలలో విడుదలైన సినిమాల్లో అన్నీ హిట్ కావు. కొన్ని ప్లాప్ అవుతాయి. మరికొన్ని హిట్ అవుతాయి. కానీ ఒకే నెలలో రిలీజైన నాలుగు సినిమాలు బిగ్గెస్ట్ హిట్ అయ్యాయి. బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అది ఎప్పుడంటే, 1994 ఏప్రియల్ నెలలో.. అవును ఆ నెలలో వచ్చిన వన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి.
మొదటగా ఏప్రియల్ 7న డాక్టర్ రాజశేఖర్ నటించిన అన్న మూవీ రిలీజయింది. రౌడీయిజం మీద కొత్త కథ, కథనం తో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఏప్రియల్14న నందమూరి బాలయ్య నటించిన భైరవ ద్వీపం మూవీ రిలీజయింది. జానపద కథకు సోషల్ ఎలిమెంట్స్ జోడించి చందమామ కథలా తీసిన ఈ మూవీ బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయింది.
ఇక నాగార్జున డ్యూల్ రోల్ తొలిసారిగా వేసిన హలోబ్రదర్ మూవీ ఏప్రియల్ 20న విడుదలై, సంచలన విజయం సాధించింది. నాగ్ కెరీర్ లో అప్పటికి బిగ్గెస్ట్ హిట్ అయింది. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన యమలీల మూవీ ఏప్రియల్ 28న వచ్చింది. యముడు కాన్సప్ట్ తో తీసిన ఈ సినిమా 250రోజుల వరకూ ప్రదర్శితమై బ్లాక్ బస్టర్ అయింది.

