పవన్ తో అయ్యే పని కాదన్న జక్కన్న…ఎందుకో తెలుసా ?
బాహుబలి తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ఆర్ ఆర్ ఆర్ మూవీ తెరకెక్కిస్తున్నారు. దీనిపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్స్ గా అలియా భట్, ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. హిందీ నటుడు అజయ్ దేవ్ గన్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రముఖ నిర్మాత డివివి దానయ్య భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.
అయితే మహమ్మారి కరోనా కారణంగా పూనేలో జరగాల్సిన షెడ్యూల్ ప్రస్తుతం వాయిదా పడింది. దీంతో అందరూ ఇళ్లకు చేరుకున్నారు. నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీగా వున్న రాజమౌళి పలు టీవీ ఛానల్స్‌కు ఇంటర్య్వూలు ఇస్తున్నాడు. అందులో ఓ ఛానల్ ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలనుకున్నాను.. ఈ విషయంలో ఆయనను గతంలో కలిశాను. కానీ, కుదరలేదు. ఆయన మళ్లీ సినిమాలు చేస్తున్నారు. ఆయన దృక్పథం అంతా వేరేలా ఉంది. ప్రజాసేవ వంటి వాటిపై ఉంది. సినిమాలకు సమయం తక్కువగా కేటాయించే అవకాశం ఉంటుంది’ అని చెప్పారు.
ఇంకా పలు ప్రశ్నలకు జక్కన్న బదులిచ్చాడు. ‘ నేనేమో రోజుల కొద్దీ సినిమాలు తీస్తుంటాను. దీంతో పవన్‌తో సినిమా తీసే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్‌కు సమాజం పట్ల బాధ్యత కానీ, సమాజానికి ఏదైనా చేయాలన్న భావన 100 శాతం ఉంటే, నాలో అది మాత్రం 0.5 ఉంటుంది. ఆయన ఆలోచన వేరు. నా దృక్పథం వేరు’అని రాజమౌళి చెప్పుకొచ్చాడు. అందుకే పవన్ తో కలిసి సినిమా తీసే అవకాశాలు లేవని తేల్చాడు.

