మెగాస్టార్ చిరును జూనియర్ ఎన్టీఆర్ ఏమని పిలుస్తాడో తెలుసా?
లాక్ డౌన్ కారణంగా ప్రతి మగాడు ఇంటి పనులలో సహాయం చేస్తూ ఉన్నారు. అయితే ఇదే ఛాలెంజ్ రూపంలో టాలీవుడ్ లో ట్రెండ్ కొనసాగుతూ ఉంది. బీ ది రియల్ మ్యాన్ అంటూ ఒక ట్రెండ్ ను కొనసాగిస్తున్నారు టాలీవుడ్ హీరోలు. అయితే జూనియర్ ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన మెగాస్టార్ చిరంజీవి, తాను చేసిన ఇంటి పనులను ఒక వీడియో రూపంలో సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో లో చిరు హల్ ను శుభ్రపరుస్తూ, పెసరట్టు ను తన అమ్మగారికి వడ్డించారు. అయితే ఈ వీడియో మెగాస్టార్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
అంతేకాక ఈ వీడియో పోస్ట్ చేస్తూ, నేను రోజూ చేసే పనినే, ఈరోజు మీకోసం ఈ వీడియో సాక్ష్యం అని చిరు పేర్కొన్నారు. అయితే చిరు పోస్ట్ చేసిన ఈ వీడియో పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సూపర్ సార్ అంటూ ఎన్టీఆర్ పేర్కొన్నారు. అయితే ఈ ఛాలెంజ్ ను చిరు రజినీకాంత్ మరియు కేటీఆర్ లకు విసిరారు.
