Movies

ఈ రెండు సినిమాలు ఇప్పుడప్పుడే రావా.? ఎప్పుడు వస్తాయో తెలుసా?

ఈ ఏడాది విడుదల కాబడిన టాలీవుడ్ సినిమాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన “సరిలేరు నీకెవ్వరు” మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం “అల వైకుంఠపురములో” ఒకదానిని మించి మరొకటి భారీ హిట్టయ్యాయి.

వెండితెర మీద ఎలా అయితే ఈ చిత్రాలు దుమ్ము రేపాయో అంతే స్థాయిలో డిజిటల్ గా కూడా అంతే సత్తా చాటాయి. అయితే ఈ రెండు చిత్రాల తాలుకా సాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న జెమినీ టీవీ వారు మహేష్ సినిమాను ఇప్పటికే టెలికాస్ట్ చేసెయ్యడం రికార్డు శాయి టీఆర్పీ కొట్టిన సంగతి తెలిసిందే.

దీనితో బన్నీ సినిమా కూడా అంతే స్థాయి టీఆర్పీ సాధించడం ఖాయం అని అంతా అనుకున్నారు అదే ఊపులో జెమినీ టీవీ వారు అతి త్వరలోనే టెలికాస్ట్ చేస్తాం అని తెలిపారు. అలాగే సరిలేరు నీకెవ్వరు సినిమా ఒరిజినల్ వెర్షన్ ను మరోసారి టెలికాస్ట్ చేస్తామని చెప్పారు. కానీ వీటి స్థానాల్లోకి ఇప్పుడు ఒక్కో వార్మ్ ఒక్కో సినిమా లైన్ లోకి వచ్చేసాయి. అంటే ఇంకో నెల రోజుల వరకు ఈ రెండు సినిమాలు జెమినీ ఛానెల్లో టెలికాస్ట్ కావడం అసాధ్యమే అని చెప్పాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."