Movies

ఉప్పెన తమిళ రీమేక్ లో స్టార్ హీరో కొడుకు హీరోగా నటిస్తున్నాడా…?

తెలుగులో నూతన దర్శకుడు బుచ్చిబాబు సాన ఉప్పెన అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ మెగా సుప్రీం హీరో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా పరిచయమవుతున్నాడు.

ఈ చిత్రంలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుండగా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత గా వ్యవహరిస్తోంది.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తమిళ మూవీ హక్కులను ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న విజయ్ సేతుపతి దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ చిత్ర హక్కులను విజయ్ సేతుపతి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొడుకు సంజయ్ కోసం కొన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

అంతేకాక ఈ చిత్రం ద్వారా సంజయ్ ని కోలీవుడ్ సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం చేయాలని విజయ్ యోచనలో పడ్డాడట. అయితే తమిళ సినీ పరిశ్రమలో విజయ్ మరియు విజయ్ సేతుపతి ల మధ్య ఉండే స్నేహ బంధం గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.అందువల్లే విజయ్ సేతుపతి సంజయ్ కోసం ఉప్పెన చిత్ర హక్కులను కొన్నట్లు తెలుస్తోంది.

అంతేగాక ఉప్పెన తమిళ రీమేక్ చిత్రంలో కూడా విజయ్ సేతుపతి విలన్ గా నటించనున్నట్లు ఇప్పటికే పలు సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.అయితే ప్రస్తుతం విజయ్ కొడుకు సంజయ్ కెనడా దేశంలో చిత్రాలకు సంబంధించిన కోర్స్ చేస్తున్నాడు.ఈ కోర్సు పూర్తయి సంజయ్ స్వదేశానికి తిరిగి రాగానే ఈ చిత్రానికి సంబంధించిన పనులు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.