Movies

మెగా అల్లుడు పరిస్థితి ఏమిటి…అక్కడికి వెళ్ళితే లక్ మారుతుందా…!

మెగా అల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన కళ్యాణ్ దేవ్ తన తొలి చిత్రం ‘విజేత’తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు.కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలవడంతో కళ్యాణ్‌తో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపలేదు.

కాగా చాలా సమయం తరువాత ఆయనతో ఓ సినిమా తెరకెక్కించేందుకు పులి వాసు అనే డైరెక్టర్ ముందుకు వచ్చాడు.‘సూపర్ మచ్చి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు.

కాగా ఈ సినిమాలో రియా చక్రవర్తి మరియు రచితా రామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడలోనూ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

కళ్యాణ్ దేవ్ చిత్రం తెలుగులో హిట్ అయితే ఆ తరువాత వేరే భాషల్లో రిలీజ్ చేస్తే బెటర్ అని పలువురు సినీ విమర్శకులు అంటున్నారు.మరి ఈ సినిమాపై చిత్ర యూనిట్ ఎంత కాన్ఫిడెంట్‌గా లేకపోతే రిలీజ్‌కు ముందే సినిమాను ఇతర భాషలో కూడా రిలీజ్ చేయనుందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."