Movies

మన్మధుడు ప్లాప్ తో షాకింగ్ నిర్ణయం తీసుకున్న రాహుల్

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. అందుకే వీలుచూసుకుని అనువైన రంగాలవైపు వెళ్తుంటారు. ఇక హీరోగా పలు చిత్రాల్లో నటించినా కూడా పెద్దగా స్టార్‌డం రాకపోవడంతో దర్శకుడిగా మారి చిలసౌ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న రాహుల్‌ రవీంద్రన్‌ తొలి సినిమాతో హిట్ కొట్టాడు. దాంతో వెంటనే నాగార్జునను డైరెక్ట్‌ చేసే ఛాన్స్ వచ్చేసింది. అలా మన్మధుడు 2 చిత్రం చేసాడు. కానీ అది ఫ్లాప్‌ అయ్యింది. సక్సెస్‌ అయి ఉంటె, వరుసగా సినిమాలు చేసేవాడు.

అయితే మన్మధుడు 2 చిత్రం ఫ్లాప్‌తో మళ్లీ అవకాశాలు వస్తాయనే నమ్మకం పోయింది. పనిగట్టుకుని ఇద్దరు ముగ్గురు హీరోలతో సంప్రదింపులు జరిపినా కూడా మన్మధుడు 2 ఫలితం నేపథ్యంలో వారు భయపడుతున్నారు.అందుకే ఆయనతో సినిమాలు చేసేందుకు ఏ హీరో కూడా ఆసక్తి చూపడం లేదన్న కామెంట్స్‌ వస్తున్నాయి. ఈ సమయంలోనే ఈయన కొత్తగా వెబ్‌ సిరీస్‌లపై దృష్టి పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా టాక్.

వెబ్‌ సిరీస్‌లు కూడా ఈమద్య కాలంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. అందుకే వెబ్‌ సిరీస్‌ ద్వారా తన సత్తాను చాటుకుని మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే నిర్ణయానికి రాహుల్‌ రవీంద్రన్‌ వచ్చినట్లు టాక్ అందుతోంది. ప్రస్తుతం ఈయన ఒక వెబ్‌ సిరీస్‌ను రూపొందించేందుకు స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాడట. తెలుగు, తమిళంలలో ఆ వెబ్‌ సిరీస్‌ ఉంటుందట. ఇక్కడైనా దర్శకుడిగా హిట్‌ కొడతాడా లేదా అనేది చూడాలి.