రవితేజ‘క్రాక్’సినిమా పరిస్థితి ఏమిటి….ట్రాక్ లో పడతాడా…లేడా…?
వరుస పరాజయాలతో దెబ్బతిన్న హీరో రవితేజ బ్రేక్ కోసం చూస్తున్నాడు. ఇదే సమయంలో తమిళ మూవీ సేతుపతి కథాంశంతో ప్రస్తుతం రవితేజతో గోపీచంద్ మలినేని ‘క్రాక్’ సినిమా తెరకెక్కిస్తు న్నారు. క్రాక్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. అందుకే ఈ సమ్మర్ లో క్రాక్ ను తీసుకు రావడం సాధ్యం కాదు. అయితే తమిళనాట వర్కౌట్ కాని సేతుపతికి కాస్త స్టైల్ మార్చి రవితేజ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా స్క్రిప్ట్ తయారుచేసినట్లు టాక్.
ఇప్పటి వరకు రవితేజ, గోపీచంద్ మలినేనిల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదుచేశాయి. వీరి కాంబోలో క్రాక్ చిత్రం మరో విజయాన్ని అందుకుని హ్యాట్రిక్ గా సాధిస్తుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. ముఖ్యంగా రవితేజ, శృతిహాసన్ ల జోడీ కూడా ఈ సినిమాకు పాజిటివ్ సెంటిమెంట్ అంటున్నారు. వీరిద్దరి జోడీ తప్పకుండా వర్కౌట్ అవుతుందనే నమ్మకం యూనిట్ సభ్యుల్లో ఉందట. అయితే సినీ వర్గాలలో కొందరు మాత్రం కొన్ని నెగటివ్ సెంటిమెంట్స్ ప్రస్తావిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఠాగూర్ మధు ఇప్పటి వరకు సరైన సక్సెస్ అందుకోలేదని అంటున్నారు.
చాలా ఏళ్లుగా నిర్మాణ రంగంలో ఉంటూ కూడా కమర్షియల్ సక్సెస్ సాధించలేదన్నది సినీ వర్గాల్లో వినిపించే వాదన. నిర్మాతతో పాటు రవితేజ కూడా ఈ సినిమాకు బ్యాడ్ సెంటిమెంట్ అంటున్నారు. వరుసగా రవితేజ ఫ్లాప్స్ చవిచూస్తూ వస్తున్నాడు. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈయన సినిమాలకు ఎంత హైప్ క్రియేట్ చేస్తే అంతగా డిజాస్టర్ అవుతున్నాయి. కనీసం క్రాక్ తోనైనా ట్రాక్ లో పడతాడో లేదో చూడాలి.
