Movies

హీరో నితిన్ కి ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తెలుసా?

యంగ్‌ హీరో నితిన్‌ పెళ్లి కరోనా కారణంగా ఆగిపోయిన విషయం తెల్సిందే.కరోనా ఎప్పటికి తగ్గేనో అంటూ నితిన్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.సుదీర్ఘ కాలంగా ప్రేమించుకుంటున్నట నితిన్‌, షాలినిలు ఈ ఏప్రిల్‌లో ఒక్కటి కావాల్సి ఉండగా కరోనా కారణంగా పెళ్లిని వాయిదా వేసుకున్నారు.పెద్ద ఎత్తున ఈ వివాహంకు ఏర్పాట్లు చేశారు.కాని పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకోక తప్పలేదు.నితిన్‌కు ఈ కరోనా కారణంగా పెళ్లి మాత్రమే కాకుండా సినీ కెరీర్‌ పరంగా కూడా నష్టం కలిగింది.

చాలా ఏళ్ల తర్వాత నితిన్‌కు భీష్మ చిత్రంతో సక్సెస్‌ దక్కింది. భీష్మ సక్సెస్‌తో మునుపటి జోరును కొనసాగించొచ్చు అనుకుని నితిన్‌ వరుసగా మూడు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. అందులో ఒకటి రంగ్‌దే ఇప్పటికే రిలీజ్‌కు సిద్దం అవ్వాల్సి ఉంది.జులైలో సినిమాను విడుదల చేస్తామంటూ ప్రకటించారు.రంగ్‌దే చిత్రంతో పాటు మరో రెండు సినిమాలు కూడా పూర్తి చేసి వెంట వెంటనే విడుదల చేయాలనుకున్నాడు నితిన్‌.కాని కరోనా కారణంగా అది వర్కౌట్‌ అవ్వడం లేదు.

నితిన్‌ ఈ ఏడాది తన జీవితంలో మర్చి పోలేని గుర్తులను ఏర్పర్చుకోవాలనుకుంటే మొత్తానికి బ్యాడ్‌ మొమోరిస్‌ అయితే ఏర్పర్చుకున్నాడు. పెద్ద ఎత్తున నితిన్‌ అంచనాలు పెట్టుకున్న రంగ్‌దే చిత్రం కూడా ఈ ఏడాదిలో విడుదల అయ్యేనో లేదో తెలియడం లేదు.నితిన్‌ కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన చిత్రంగా రంగ్‌దే నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. మరి ఈ చిత్రంతో నితిన్‌ తదుపరి సక్సెస్‌ను దక్కించుకుంటాడా చూడాలంటే మరి కొన్ని నెలలు వెయిట్‌ చేయాల్సిందే.