Movies

మెగాస్టార్ సినిమా కూడా ఓటిటి లోకి?

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ రంగం విప్లవం మరింత స్థాయిలో పెరిగింది. దీనికి కారణం సినిమాలు విడుదల అయ్యే సూచనలు దూరం కావడమే. దీనితో ఈ సమయం ఓటిటి ప్లాట్ ఫామ్ కు చాలా ప్లస్ అయ్యింది. దీనితో విడుదలకు రెడీగా ఉన్న సినిమాలు కాస్తా డైరెక్ట్ గా మొబైల్ మరియు టీవీ తెరపైనే చూసేసే అవకాశం వచ్చేస్తుంది.

ఐతే మన దేశంలో ఉన్న కీలక సినీ ఇండస్ట్రీలలో కోలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమా మేకర్స్ మాత్రమే తమ సినిమాలను ఎక్కువగా ఓటిటి లో విడుదల చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ మెగాస్టార్ అంటే మన తెలుగు మెగాస్టార్ చిరంజీవి సినిమా కాదు.

మన మెగస్టార్ తాను కాదు మన ఇండియాలోనే అసలైన మెగాస్టార్ ఆయనే అని చెప్పిన హీరో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న తాజా చిత్రం “ఝమ్డ్” ను డైరెక్ట్ గా ఓటిటి లో రానున్నట్టు తెలుస్తుంది. అలాగే అమితాబ్ వారసుడు అభిషేక్ బచ్చన్ నటిస్తున్న “లూడో” సినిమా కూడా అలాగే అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ కరోనా దెబ్బ వల్ల ఎంత లాభం చేకూరుతుందో అంతే నష్టం కూస్తో వాటిల్లుతుంది అని చెప్పాలి.