Movies

“సాహో” బాటలోనే “పుష్ప”..?

ఇప్పుడిప్పుడే మన తెలుగు సినిమాలు మొత్తం దేశ వ్యాప్తంగా తమ దమ్మెంటో చూపిస్తున్నాయి. బాహుబలి తో నార్త్ లో మొదలైన తెలుగు సినిమా ప్రస్థానం సాహో తో కూడా కొనసాగింది. ఇక అక్కడ నుంచి మన తెలుగు హీరోల సినిమాలు మెల్లగా పాన్ ఇండియన్ క్రేజ్ తెచ్చుకొని ఇతర ఇండస్ట్రీలలో కూడా తమ సత్తా చాటేందుకు పూనుకుంటున్నారు

అయితే డార్లింగ్ హీరో ప్రభాస్ నటించిన “సాహో” సినిమా బాటలోనే ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప” కూడా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సాహో సినిమాను ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ సినిమాగా మలిచేందుకు గట్టిగానే కష్టబడ్డారు. ముఖ్యంగా అయితే బాలీవుడ్ జనాన్ని కాని ఆకర్షించినట్టైతే పాన్ ఇండియా సినిమాగా అది 70 శాతం సక్సెస్ అయ్యిపోయినట్టే.

అందుకే సాహో కోసం బాలీవుడ్ షేడ్స్ ఎక్కువగానే తీసుకున్నారు. అందులో భాగంగానే ఒక స్పెషల్ సాంగ్ కు బాలీవుడ్ ఫేమస్ నటి జాక్వలిన్ ఫెర్నాండెజ్ ను తీసుకున్నారు. ఇప్పుడు పుష్ప టీం కూడా ఏ బాటలో ఈ సినిమాలోని ఒక స్పెషల్ ఐటెం సాంగ్ కోసం ఒక టాప్ బాలీవుడ్ నటినే అనుకుంటున్నట్టు సమాచారం. సుకుమార్ తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ కోసం ఎంత కేర్ తీసుకుంటారో అందరికీ తెలుసు. మరి అలాంటిది తన ఆల్ టైం మోస్ట్ లవబుల్ కాంబో కాంబో కాబట్టి సుక్కు మరింత పక్కాగా ప్లాన్ చేస్తారని చెప్పాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."