Movies

మన టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోకీ లేని క్రెడిట్ ఒక్క రామ్ కే..!

టాలీవుడ్ ఎనర్జటిక్ స్టార్ రామ్ కెరీర్ ను ఒక్క సారిగా మలుపు తిప్పిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది లేటెస్ట్ గా తీసిన ఇస్మార్ట్ శంకర్ అని చెప్పాలి. అప్పటి వరకు సరైన హిట్ లేని సమయంలో పూరి అందించిన చిత్రం వీరిద్దరి కంబ్యాక్ కు అస్సలైన సినిమాగా మారింది. కేవలం వారికి మాత్రమే కాకుండా మణిశర్మ కు కూడా ఒక సాలిడ్ కంబ్యాక్ ను ఇచ్చింది.

ఇలా ఎన్నో సంచలనాలు రేపిన ఈ చిత్రం నిన్ననే యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ అందుకున్న మరో తెలుగు డబ్బింగ్ చిత్రంగా రికార్డు నమోదు చేసింది. అయితే మన టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోకు కూడా దక్కని క్రెడిట్ కేవలం ఒక్క రామ్ కు మాత్రమే దక్కింది అని రామ్ అభిమానులు అంటున్నారు.

రామ్ నటించిన గత నాలుగు సినిమాలు తాలూకా హిందీ వెర్షన్ లూ 100 మిలియన్ వ్యూస్ మార్క్ ను అందుకోవడమే కాకుండా ప్రతీ సినిమా కూడా 1 మిలియన్ లైక్స్ ను టచ్ చేసాయి. దీనితో మొత్తం నాలుగు సినిమాలకు 100 మిలియన్ వ్యూస్ మరియు 1 మిలియన్ లైక్స్ అందుకున్న ఏకైక హీరోగా రామ్ నిలిచాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."