Movies

రేపు శనివారం స్టార్ మాలో మరో కొత్త సినిమా

తన మొదటి సినిమా “ఆర్ ఎక్స్ 100” తో కేవలం హీరోగానే కాకుండా నాచురల్ స్టార్ నానితో “గ్యాంగ్ లీడర్” సినిమాలో అగ్రెసివ్ విలన్ గా కూడా హీరో కార్తికేయ అద్భుతమైన నటన కనబర్చారు. అలా కార్తికేయ మళ్ళీ హీరోగా నేహా సోలంకి హీరోయిన్ గా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “90 ఎంఎల్”.

ముందుకు సంబంధించిన వైవిధ్య కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మాస్ మరియు యూత్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. వెండి తెర మీద అలరించిన కార్తికేయ ఇప్పుడు బుల్లితెర ఆడియన్స్ ను ఆకట్టుకోడానికి తన 90 ఎంఎల్ ను తీసుకొస్తున్నాడు. ఈ చిత్రాన్ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా వారు రేపు శనివారం సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కానుంది. ఒకవేళ ఈ చిత్రాన్ని అప్పుడు మిస్సయితే ఈసారి మాత్రం మిస్సవ్వకుండా చూసెయ్యండి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."